JAISW News Telugu

Hyderabad : బోసిపోయిన హైదరాబాద్.. ఎందుకంటే?

Hyderabad

Hyderabad

Hyderabad : హైదరాబాద్ లో ఎప్పడూ ట్రాఫిక్ రద్దీతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతుండగా.. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రోడ్లు వెలవెలబోయాయి. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాలకు చెందిన సెటిలర్లు సొంత ప్రాంతాలకు తరలివెళ్లారు. దీంతో నగరంలో రోడ్లు మొత్తం  కర్వ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎప్పుడూ చూసే హైదరాబాద్ నగరమేనా అనే అనుమానం వచ్చేలా సైలెన్స్ వాతావరణం నెలకొంది.

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. హైదరాబాద్ ఓటర్లు కూడా నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సిటీలో ఇంత పెద్దగా రోడ్లు ఉంటాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ట్రాఫిక్ తో ఏదో ఒక ఇరుకు ప్లేస్ నుంచి తమ వెహికల్స్ ను నడిపించుకుంటూ తీసుకెళుతుంటారు. కానీ ఒక్కసారిగా అందరూ గ్రామాలు, పల్లెల బాట పట్టడంతో నగరం మొత్తం సైలెన్స్ అయిపోయింది.

ఫ్లై ఓవర్లపైన ఎలాంటి వెహికల్స్ లేకుండా బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కువ ట్రాఫిక్ ఉండే యూసుఫ్ గూడా చెక్ పోస్టు, దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట, బేగంపేట, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఉప్పల్ జంక్షన్  లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ లేకపోవడంతో రోడ్లన్నీ బోసిపోతున్నాయి. అసలు హైదరాబాద్ ఇంత ప్రశాంతంగా చూడటం.. కరోనా తర్వాత ఇదేనేమో అని అనుకుంటున్నారు.

కరోనా సమయంలో కొవిడ్ రూల్స్ పెట్టడంతో ట్రాఫిక్ లేకుండా పోయేది. కేవలం పేషంట్లకు చెందిన వాహనాలు, ఇతర ఎమర్జెన్సీ వాహనాలు మాత్రమే తిరగనిచ్చేవారు. కానీ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చాలా మంది స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో చడీ చప్పుడు లేకుండా మారింది. నిజంగా ఇది భాగ్యనగరమేనా.. అనే డౌట్ కలుగుతుంది. పార్లమెంటు ఎన్నికలు నేడు జరగుతుండగా.. రిజల్ట్ జూన్ 4 న రాబోతుంది. ప్రజలు ఈ సారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు చురుగ్గా పాల్గొంటున్నారు. దీనికి ఉదాహరణే హైదరాబాద్ నగరంలో బోసిపోయిన రోడ్లనీ చెప్పొచ్చు.

Exit mobile version