CM Chandrababu : ఇటీవల ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైంది. 2019లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సెంబ్లీలో ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. ప్రజలు ఈ తీర్పును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక కారణంతో ఇచ్చారు.
జగన్, ఆయన అమాత్యులు ఏపీలో సాగించిన అరాచకం వల్ల ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వద్దని ప్రజలు అనుకున్నారు. ఇది ప్రజా తీర్పు అని, దాన్ని గౌరవించాలి. ప్రతిపక్ష హోదా లేదు అంటే జగన్ కు కేబినెట్ హోదా కూడా లేదన్నమాట. దానితో పాటు వచ్చే ఇతర సౌకర్యాలు కూడా ఉండవు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం జగన్ కు మినహాయింపులు ఇస్తున్నారు.
మంత్రుల మాదిరిగానే జగన్ కారును అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిని కోరారు. అక్షర క్రమంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మంత్రుల వెంటే జగన్ కూడా ప్రమాణం చేయాలని మరోసారి అభ్యర్థించారు. ఇక మూడో అభ్యర్థన కూడా ఉంది. కానీ రెండు అభ్యర్థనలకే చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారు.
ఈ అధికారాలు ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా సంపాదించాలి. అసలు నిబంధనలు కూడా అలానే ఉంటాయి. చంద్రబాబు నాయుడు జగన్ కు, వైసీపీకి మినహాయింపులు ఇవ్వడం మానుకోవాలి. ప్రమాణ స్వీకారానికి తన పేరు వచ్చినప్పుడు సభలోకి ప్రవేశించిన జగన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే సీటులో కూర్చోకుండా తన ఛాంబర్ వైపు వెళ్లిపోయాడు.
జగన్, 10 ఎమ్మెల్యేలకు మొదటి వరుస ఇవ్వాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తదుపరి (మూడో) అభ్యర్థన. కాని వారి సంఖ్యా కారణంగా వారు చివరకు కూర్చోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష హోదా మాత్రమే ముందు వరుసలో కూర్చునేందుకు అనుమతి ఉంటుంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ఆ హోదాను పొందలేకపోయింది. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి!