Financial crisis : ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా.. ఉద్యోగులకు ఉచిత కాఫీ, టీలు ఎందుకో తెలుసా?

financial crisis

financial crisis

financial crisis : ఇంటల్ తన ఉద్యోగులకు గుడ్య న్యూస్ చెప్పింది. తన వర్క్ ఫోర్ష్ ని ఎంకరేజ్ చేసేందుకు కొత్తగా సౌకర్యాలను కల్పిస్తోంది. ఇంటెల్ ఆఫీస్ వర్క్ ను ప్రోత్సహించే క్రమంలో ఉద్యోగులకు తిరిగి కార్యాలయాల్లో ఉచితంగా కాఫీ, టీ అందిస్తున్నట్ల ప్రకటించింది. ఈ శుభవార్తను ఉద్యోగులకు మెసేజ్ షేర్ చేసింది. ఇంటెల్ తన ఉద్యోగులకు పంపించిన మెసేజ్ లో డైలీ లైఫ్ కావాల్సిన సౌకర్యాల ప్రాముఖ్యతను తెలిపింది. ఇంటెల్ ఇప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పటికీ చిన్నచిన్న సౌకర్యాలు రోజువారీ పనుల్లో కీలకమని గుర్తించినట్లు ఉద్యోగులకు పంపిన మెసేజ్ లో చెప్పింది. అంతేకాదు మేం తీసుకున్న ఈ నిర్ణయం ఆఫీస్ ఎన్విరాన్ మెంట్ ను బాగా ప్రోత్సహిస్తుందని తెలిపింది.

అయితే, మరోవైపు ఇంటెల్ కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు వర్క్ ఫోర్స్ ను తగ్గించుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 15 వేల మందిని తొలగించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబరులో 2 వే మంది సిబ్బందిని తొలగించింది.

TAGS