Anchor Anasuya : స్టార్ లేడీ యాంకర్, సినీ నటి అనసూయ ప్రస్తుతం తన అందాలతో అందరినీ కవ్విస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. తన అందాలతో కనువిందు చేస్తోంది. కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. నలభైల్లోకి వచ్చినా ఇంకా కుర్ర హీరోయిన్ల వలే హాట్ హాట్ డ్రెస్సులతో మతిపోగొడుతోంది. హాట్ అంటీగా అనసూయను కలలోకి తెచ్చుకోని కుర్రోడు ఉండడంటే అతిశయోక్తి కాదు. యూత్ లో ఆమెకున్న క్రేజ్ అది. విజయ్ దేవరకొండను కోట్ చేస్తూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ లో అనసూయ పేరును ఉదహరించడంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తోంది.
నేను తెలంగాణ బిడ్డనే. దేవుడిపై నమ్మకం ఉన్న దానినే. అమ్మానాన్నల పెంపకంలో పెరిగాను. చిల్లర వేషాలు తెలియవు. సంప్రదాయ కుటుంబంలోనే పెరిగాను. నాకు అన్ని విషయాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. అస్తమానం వార్తల్లో ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి చౌకబారు పోస్టులు అక్కర్లేదు. ఇతర వ్యాపకాలు లేవు. ఇతర సంబంధాలు కూడా లేవు.
అనసూయ సినిమాల్లో నటించి మెప్పిస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. పుష్పలో దాక్షాయనిగా చేసింది. విమానంలో వేశ్య పాత్రలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం పుష్ప-2లో మంచి పాత్ర చేస్తోంది. రజాకార్ సినిమాలో పోచమ్మగా నటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈనేపథ్యంలో అనసూయ మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉంది.
జబర్దస్త్ వేదిక ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ మెల్లగా సినిమాల్లోకి వచ్చింది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రస్తుతం మంచి పాత్రలు దక్కించుకుంటోంది. సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటోంది. సినీ వినీలాకాశంలో విహరిస్తోంది. సినిమాల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకు గాను మంచి పాత్రలు వస్తేనే ఓకే చేస్తోంది.
అనసూయ సినీ రంగ ప్రవేశంతో తన జాతకమే మారిపోతోంది. వ్యాఖ్యాతగానే జీవితం ప్రారంభించినా ప్రస్తుతం నటిగానే బిజీగా మారిపోయింది. ప్రస్తుతం టీవీ షోలకు టాటా చెప్పేసింది. సినిమాలే లోకంగా ఉంటోంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శభాష్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తోంది. భవిష్యత్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు.