Dogs Chase Vehicles : మనం ఏదైనా ప్రదేశానికి వెళ్లే సమయంలో కుక్కలు వెంటపడటం కామనే. ప్రతిసారి కాకుండా ఎప్పుడో ఒకసారి అందరు ఈ సంఘటనలను ఎదుర్కొన్నవారే. కుక్కలు ఎందుకు మన వాహనం వెంట పరుగెడతాయి. అందులో ఉన్న మర్మం ఏమిటో చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో కుక్కలు మన వాహనాన్ని వెంబడిస్తే మనం ఇంకా స్పీడ్ పెంచుతాం.
దీనిపై చాలా మంది పరిశోధనలు కూడా చేస్తున్నారు. కుక్కలు మనం బండి మీద కానీ కారు మీద కానీ వెళ్లే సందర్భంలో ఎందుకు వెంట పడతాయి. దీనికి కారణమేంటనే దానిపై ఓ వివరణ ఇస్తున్నారు. మన వాహనంపై ఇతర కుక్కలు మూత్రం పోస్తుంటాయి. బండి ఎక్కడ పెట్టినా దాని మీదే కాలు లేపి మూత్ర విసర్జన చేస్తుంటాయి. అందువల్లే అవి మన వెంట పడతాయట.
వాటి మూత్రం వాసన వాటికి అందుతుంది. దీంతో ఏదో కుక్క అక్కడకు వస్తుంది. దాన్ని రానీయొద్దనే ఉద్దేశంతో మనం ఎంత వేగంగా నడిపితే అంతే వేగంగా అవి పరుగు పెడతాయి. మనం నెమ్మదిగా నడిపితే అవి మెల్లగానే వస్తాయి. కానీ మనకు భయం వేసి కాళ్లు మీదికి పెట్టుకుని వాహనాన్ని వేగంగా ముందుకు పోనివ్వడం సహజమే. ఇలా కుక్కలు మనల్ని వెంబడిస్తాయని నమ్ముతుంటారు.
ఇంకా వాహనాల నుంచి వచ్చే వింత శబ్దాలకు కూడా కుక్కలు పసిగట్టి మనపై దాడికి పూనుకుంటాయట. వాహనాల్లో మనం ఏవైనా తిండి పదార్థాలు తీసుకెళ్తుంటే కూడా పసిగట్టి వాటిని అందుకోవాలని కూడా చూస్తాయట. ఇలా కుక్కలు మనల్ని వెంబడిస్తూ భయానికి గురి చేయడం చేస్తుంటాయట. ఇందులో ఉన్న మర్మాలు ఇవే అని వెల్లడిస్తున్నారు.