BRS Leaders Hate Andhra People : ఆంధ్రావాళ్లపై ఈ బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత విద్వేషం?
BRS Leaders Hate Andhra People: మనదేశంలో ఏ రాష్ట్రం వారైనా ఎక్కడైనా జీవించొచ్చు. అది మనకు రాజ్యాంగం కల్పించిన వరం. కానీ తెలంగాణలో మాత్రం ఆంధ్రప్రదేశ్ వారిని సెటిలర్స్ అనే పదంతో బీఆర్ఎస్ విద్వేషం చిమ్మింది. దీంతో వారు రాష్ట్రం విడిచి పారిపోవడం జరిగింది. ఇలా ఏపీ వారిని హీనంగా చూడటం వల్లే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు సరిగా లేకుండా పోయాయి.
మన తెలుగువారు ముంబయి, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, అమెరికా లాంటి దేశాల్లో కూడా స్థిరపడ్డారు. అక్కడ ఉన్నత పదవులు కూడా పొందారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మన భారతీయుడే కావడం గమనార్హం. ఇంకా పలు దేశాల్లో మనవారు తమ ప్రభావం చూపుతూ ఎన్నో పదవుల్లో ఉన్నారు. వారిని సెటిలర్స్ అని ఎక్కడ కూడా పేర్కొనడం లేదు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సెటిలర్స్ పదం ఇక్కడ ఎందుకు వాడాల్సి వచ్చింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుండటం కామనే. అంత మాత్రాన వారిని విదేశీయుల మాదిరి హేళనగా చూడటం తగదు. తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని ఏమనకపోయినా ఆంధ్రా వాళ్లను మాత్రం సెటిలర్స్ అంటూ విద్వేషంగా చూడటం దారుణం.
హైదరాబాద్ లో ఆంధ్రా వాళ్లు ఉన్న ప్రాంతాలను కూడా ప్రత్యేకంగా చూస్తారు. వారేదో ఇతర దేశాల నుంచి వచ్చిన వారుగా పోలుస్తారు. దీంతో వారు మనదేశంలోనే ఉన్నామా లేక పరాయి దేశానికి వచ్చామా అనే ఫీలింగ్ లో ఉంటున్నారు. బీఆర్ఎస్ రేపిన విద్వేషం వారిని పరాయి వాళ్లుగా చేసింది. ఆంధ్రా సెటిలర్స్ పేరుతో విభజించి చూడటం వారికి ఇబ్బందిగా ఉంటోంది. కానీ మన వారి వల్ల వారు పలు సమస్యల్లో పడుతున్నారనేది వాస్తవం.