JAISW News Telugu

wild card contestants : వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు ఆమెనే ఎందుకు టార్గెట్ చేశారు?

wild card contestants

wild card contestants

wild card contestants : బిగ్ బాస్ సీజన్-8 లోకి  ఆరో వారంలో ఏకంగా 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లో చేరిపోయారు.  ఆరో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీలతో వచ్చిన కంటెస్టెంట్లు రచ్చరచ్చ చేయబోతున్నారు. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ కు తెరతీశాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే నామినేషన్స్ ఎపిసోడ్ రానే వచ్చిందిజ ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ పరస్పరం నామినేట్ చేసుకుంటూ, గొడవలు పడుతుంటారు. టీఆర్పీ రేటింగ్ కూడా  గత వారం వీకెండ్ ఎపిసోడ్స్ కంటే నామినేషన్స్ ఎపిసోడ్స్ కి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో నామినేషన్స్ ఎపిసోడ్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో స్పష్టమవుతున్నది. గత ఐదు వారాలు జరిగిన నామినేషన్స్ వేరు.. ఆరో వారం జరిగిన నామినేషన్స్ వేరు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ ఆదివారమే జరిగినా  ప్రసారం అయ్యేది మాత్రం నేటి నుంచే. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కువ టాస్కులు రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్) గెలవడం తో, పాత కంటెస్టెంట్లను నామినేట్ చేసే అవకాశం లేదని బిగ్‌బాస్ చెప్తాడు .

ఇక ఇక్కడి నుంచి వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు నామినేషన్స్ ప్రారంభిస్తారు. ఎక్కువ శాతం మంది కంటెస్టెంట్లు యష్మీ కి నామినేషన్స్ వేస్తారు. ఆదివారం ఎపిసోడ్ చివర్లో ప్రసారం చేసిన ప్రోమోలో హరితేజ యష్మీకి, పృథ్వీ రాజ్ కు నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత టేస్టీ తేజ నామినేషన్ వేయడాన్ని మనకు ప్రోమో లో చూపిస్తారు.  వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు విష్ణు ప్రియ, యష్మీ, సీత, పృథ్వీని నామినేట్ చేస్తారు. చివరలో బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇస్తాడు. ‘ఓజీ’ క్లాన్ సభ్యులు(పాత కంటెస్టెంట్లు) అంతా మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చి ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని నామినేట్ చేయమని అంటాడు బిగ్ బాస్. ఓజీ క్లాన్ సభ్యులు దీనిపై చర్చించుకొని మెహబూబ్, గంగవ్వ ను నామినేట్ చేస్తారు. అలా ఓజీ క్లాన్ నుంచి నలుగురు, రాయల్ క్లాన్ నుంచి ఇద్దరు, మొత్తం మీద ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లోకి వచ్చేశారు. వీరిలో సోషల్ మీడియా పోలింగ్స్ ప్రకారం మై విలేజ్ షో గంగవ్వ అందరికంటే ముందుంటుంది.

ఆ తర్వాత ప్లేస్ లో విష్ణు ప్రియ కొనసాగుతుండగా, మూడో స్థానం లో యష్మీ ఉంటుంది. ఇక నాలుగో స్థానం లో మెహబూబ్ కొనసాగుతుండగా, ఐదో స్థానం లో పృథ్వీ, ఇక చివరి స్థానం లో సీత ఉంటుంది. వీరిలో సీత, పృథ్వీ కి మధ్య ఓటింగ్ వ్యత్సాసం చాలానే ఉంది. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈ వారం ఆమె టాస్క్ లన్నీ అధిగమిస్తే మొదటి రెండు వారాలు చూపించిన సీతని మళ్లీ చూపిస్తే గనక టాప్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వారం యష్మీ నామినేషన్స్ లోకి వస్తే మాత్రం ఎలిమినేట్ అవుతుందని అందరూ భఆవిస్తున్నారు. కానీ ఆమెకు ఓటింగ్ బాగా ఉన్నట్లు సమాచారం.

Exit mobile version