Vijaya shanthi Congress Party : ప్రముఖ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి పార్టీలు మారడం అలవాటే. ఆమె ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో తెలియదు. పలు పార్టీలు మారుతూ ఉంటుంది. పార్టీలన్ని మారింది. బీఆర్ఎస్ లో కొద్ది రోజులు ఉంది. తరువాత బీజేపీలోకి చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. సినీ గ్లామర్ ను రాజకీయాల్లో వాడుకోవాలని చూస్తోంది.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసింది. కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి నిర్ణయించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హైదరాబాద్ లో కాసేపటి క్రితమే భేటీ అయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఆమెను ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో విజయశాంతి పార్టీ మారినా పెద్ద ఆశ్చర్యమేమీ లేదని పలువురు పేర్కొనడం గమనార్హం.
బీజేపీలో తనకు ఆదరణ దక్కలేదని అక్కసుతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించింది. ఏ పార్టీలో ఉన్నా ఏదో ఒక కారణంతో పార్టీ ఫిరాయించడం ఆమెకు కొత్తేమీ కాదు. అన్ని పార్టీలు మారింది. ఏ పార్టీలోనూ ఇమడలేదు. ఒక్క మాట మీద లేకుండా అన్ని పార్టీల్లోనూ తిరిగినా పెద్ద ప్రభావం కనిపించలేదు. ఓట్లను రాబట్టడంలో ఆమెకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
గతంలో కూడా బీజేపీలో చేరిన విజయశాంతి మరోమారు చేరి దానికి రాజీనామా చేయడం విచిత్రమే. ఆమె ఏ పార్టీలో ఉన్నా ఆదరణ లేకపోవడంతోనే పార్టీలు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినా ఒరిగేదేమీ లేదని చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నా ఫలితం మార్చే శక్తి ఆమెకు లేదని అంటున్నారు.