MDH-Everest Masalas : ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలను ఆ దేశాలు ఎందుకు నిషేధించాయంటే..

MDH-Everest Masalas

MDH-Everest Masalas

MDH-Everest Masalas : భారతీయ మసాలాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఎన్నో వంటకాలకు మంచి రుచి, వాసన కలిగించే ఈ మసాలాలను పలు దేశాల్లో వాడుతున్నారు. మసాలా మార్కెట్ లో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారతీయ మసాలా పౌడర్ బ్రాండ్లు అయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ పై తాజాగా సింగపూర్, హాంకాంగ్ నిషేధం విధించాయి. వీటిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని నిర్ధారణ కావడంతో ఈ రెండు దేశాలు.. ఈ బ్రాండ్లను నిషేధించాయి. ఇప్పటికే భారత్ లో భారీగా ఈ బ్రాండ్లు అమ్ముడవుతున్న నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు ఈ ఘటనపై స్పందించింది. వీటి శాంపిల్స్ ను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది.

భారతీయ మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ పై హాంకాంగ్, సింగపూర్ నిషేధం విధించినా కేంద్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ ప్రభుత్వ అధికారులు స్పందించారు. దేశంలోని ఫుడ్ కమిషనర్లందరినీ అలర్ట్ చేశారు. మసాలా దినుసుల నమూనాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు.

కాగా మసాలా మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ అక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్లు  హాంకాంగ్, సింగపూర్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీలు గుర్తించాయి. చికెన్ మసాలా, సాంబార్ మసాలా, ఫిష్ మసాల్లో ఈ క్యాన్సర్ కారక ఇథిలిన్ అక్సైడ్ ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ ఉత్పత్తులను తిరిగి భారత్ కు తిరిగి పంపంచివేయాలని సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో నిషేధానికి గల కారణాలపై వివరణాత్మక నివేదిక అందించాలని రెండు దేశాల్లో ఉన్న ఎంబసీలను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం రెండు దేశాలకు చెందిన ఆహార భద్రతా నియంత్రణ సంస్థల నుంచి భారత ఎంబసీ వివరాలు సేకరించే పనిలో ఉంది. మసాలాల నిషేధానికి గల కారణాలను కంపెనీల నుంచి కోరామని అధికారులు చెబుతున్నారు. వివరాలు అందగానే సంబంధిత ఎగుమతి దారులతో చర్చిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.

TAGS