JAISW News Telugu

Janasena : జనసేనకు కేంద్ర కేబినేట్ పదవి ఎందుకు దక్కలేదు..!

Janasena

Janasena

Janasena : ఎన్డీయే ప్రభుత్వంలోని ప్రధాని, మంత్రులు ఈ రోజు (జూన్ 9) ప్రమాణ స్వీకారం చేశారు. కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆశయాలు తీర్చేందుకు ముచ్చటగా మూడో సారి మోడీ (3.O) ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఆయన పరివారం (మంత్రులు) కూడా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయేలో ప్రధాన పార్టీ అయిన బీజేపీతో పాటు మిత్ర పక్షాలకు బెర్తులను ఖరారు చేసింది పార్టీ. కానీ ఇందులో ‘జనసేన’కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

ఏపీలో కూటమి కట్టేందుకు, కూటమి అధికారంలోకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్, జనసేన ఎంతో కృషి చేసింది. పైగా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన తక్కువ సీట్లలో అన్నింటిలో కూడా మంచి మెజారిటీతో గెలిచింది. ఎన్డీయే ప్రభుత్వంలో ఏపీ నుంచి బీజేపీకి, టీడీపీకి మంత్రి పదవులు వచ్చాయి. కానీ జనసేనకు మాత్రం దక్కలేదు. ప్రతీ విషయంలో పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన ప్రధాని జనసేనకు మంత్రి పదవిని ఎందుకు కేటాయించలేదని సందేహం వ్యక్తం అవుతుంది. అసలు జనసేనకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుపడ్డారంటూ ఏపీ చర్చ మొదలైంది.

ఏపీ నుంచి పరిశీలిస్తే టీడీపీకి రెండు మంత్రి పదవులు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. టీడీపీ నుంచి చంద్రబాబు సూచించిన ఇద్దరు, బీజేపీ నుంచి కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు. కానీ, జనసేనలో ఇద్దరు ఎంపీలు ఉన్నా అవకాశం మాత్రం దక్కలేదు. టీడీపీకి ఒక కేబినేట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. జనసేన నుంచి బాలశౌరి వస్తుందని అంతా అనుకున్నా.. లిస్టులో మాత్రం కనిపించ లేదు. అసలు కేంద్ర కేబినేట్ లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా..? అని జనసేనలో ఆసక్తి కర చర్చ జరుగుతోంది.

పవన్ అడగలేదా? వారే ఇవ్వలేదా?
కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర వహించారంటూ ఎన్డీఏ సమావేశంలో మోడీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు. కానీ మంత్రి పదివి మాత్రం ఇవ్వలేదు. విస్తరణ సమయం వరకు వేచి చూడాలని చంద్రబాబుతో పవన్ ను ఒప్పించారనే ప్రచారం వినిపిస్తోంది. టీడీపీకి 2 పదవుల్లో ఒకటి జనసేనకు ఇచ్చి.. విస్తరణ సమయంలో టీడీపీకి మరోటి ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి విషయంలో జనసేనకు ప్రాధాన్యత దక్కకపోవడంపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 

Exit mobile version