Exit Polls : ఎగ్జిట్ పోల్స్ తో హైరానా ఎందుకు? మూడ్రోజులు ఆగితే అసలైన ఫలితాలే వస్తాయిగా!

Exit Polls

Exit Polls

Exit Polls : దేశంలో ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. రేపటితో ఏడు దశల్లో ఎన్నికలు ముగుస్తాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు అడ్డుగా ఉండడంతో, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి వెనకంజ వేస్తున్నాయి. దేశంలో ఆఖరి విడత పోలింగ్ పూర్తయిన వెంటనే తమ నివేదికలను బహిరంగంగా ప్రకటించేందుకు సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే దేశ రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు కాస్త భిన్నంగా ఉన్నాయి.

ఏపీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు, స్థానికత కీలకపాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని ముందే ఓ అంచనాకు రావడం పరిపాటే. సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ముందుగానే ప్రకటిస్తాయి. ఈ సారి జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. దీంతో అన్ని రాజకీయపార్టీలు అయోమయంలో పడ్డాయి. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందో అని పార్టీలు ఓ అంచనాకు రాలేకపోతున్నాయి. పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందన్న దానిపూ రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందోనన్న విషయంలోనూ క్లారిటీ రావడం లేదు. దీంతో ఎగ్జిట్ పోల్స్‌పై రాష్ట్రంలోని పార్టీలన్నీ ఆశలు పెట్టుకున్నాయి.

కాకపోతే ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఎగ్జిట్ పోల్స్‌పై  పెద్దగా ఆశలు పెట్టుకోలేనట్లు సమాచారం. కేంద్రం నుంచి వచ్చిన నివేదికల్లో కూడా కూటమిపై సానుకూల రిపోర్ట్ రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు డీలా పడ్డట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే టీడీపీకి ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వస్తాయని వాళ్లకి వాళ్లే లీకులు ఇచ్చుకున్నట్లు ఉంది. దీంతో టీడీపీ క్యాడర్ డీలా పడిపోయి నిరాశ నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు.  కూడా కూటమి అధికారంలోకి రాదన్న చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్‌పై టీడీపీ ఏమాత్రం ఆశలు పెట్టుకోలేదని అర్థం అవుతుంది. మరో మూడు రోజుల్లోనే అసలైన ఫలితాలు వస్తుంటే ఇక ఎగ్జిట్ పోల్స్ తో సంతోషపడడమో, బాధపడడమో ఎందుకని కొందరు అంటున్నారు.

TAGS