BJP : కేంద్రంలో భారతీయ జనత పార్టీ 3వ సారి అధికారం చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. అందుకు తగ్గ వ్యూహాలను దాదాపు రెండేళ్ల నుంచే వేసుకుంటూ వస్తుంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కూడా మూడో సారి కూడా అధికారంలోకి వస్తామని ధీమా చెప్పారు. బీజేపీ 370 సీట్లు, ఎన్డీయే మిత్ర పక్షాలకు 400 సీట్లు వస్తాయని ‘ఔర్ ఏక్ బార్ 400 పార్’ అంటూ స్లోగన్ కూడా ఇచ్చారు.
అయితే, మోడీ ఏదో రండమ్ గా 370 సీట్లు అని చెప్పలేదు. దీని వెనుక చాలా మతలబు ఉంది. అదేంటంటే.. లోక్ సభలో మొత్తం సీట్లు 545 అందులో మూడో వంతు అంటే 363 సీట్లు అన్నమాట. అయితే ఇన్ని సీట్లు వస్తే ఏం జరుగుందని చాలా మందికి తెలియకపోవచ్చు. దాని గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే ఆ నెంబర్ కు అంత ప్రాముఖ్యం ఉంది.
లోక్ సభలో ఉన్న మొత్తం సీట్లలో ఒకే పార్టీ 363 సీట్లను సంపాదించుకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ‘అమిండ్‌మెంట్ ఆఫ్ ది కానిస్టిట్యూషన్’ కింద సదరు పార్టీకి రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్ ను మార్చే.. లేదంటే తొలగించే.. లేదంటే సవరించే అధికారం వస్తుంది. అందుకే ఈ సారి బీజేపీ 370 కోసం పట్టుబట్టింది. ఇది గనుక సాధ్యమైతే దేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 70 ఏళ్ల దేశ భవిష్యత్ ను సమూలంగా మార్చే అవకాశం వస్తుంది. అందుకే మోడీ ఆ దిశగా సీట్లను సాధించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.