Vijayamma : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లు అధికారం తమదే అనుకున్న జగన్ కు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. తన చెల్లెలు షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా కావడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా జగన్ కు పరిస్థితులు వ్యతిరేకంగా మారనున్నాయి. షర్మిల తెలంగాణలో ఉన్నంత కాలం జగన్ కు ఇబ్బందులు రాకున్నా ఇప్పుడు చెల్లెలు రూపంలో అడ్డంకులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు తల్లి విజయమ్మ కూడా కూతురు వైపే ఉండనుంది. జగన్ గెలుపు కోసం తల్లి, చెల్లెలు ప్రచారం చేసినా వారి సేవలు గుర్తించడంలో జగన్ నిర్లక్ష్యమే చూపారు. అందుకే షర్మిల తన దారి తాను చూసుకుంది. షర్మిలకు ఏదో మంత్రి పదవి ఇస్తే సరిపోయేది. జగన్ కాదనడంతో తన దారి తాను చూసుకోవాల్సి వచ్చింది. అందుకే తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తన సొంత రాష్టానికి వెళ్లి తన ప్రభావం చూపించాలని భావిస్తోంది.
ఏపీలో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడంతో జగన్ లో భయం మొదలైంది. ఈనేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో జగన్ కు పోటీగా నిలిచే అవకాశముంది. దీంతో జగన్ కు ఎదురు దెబ్బ తగిలే సూచనలే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా విజయం సాధించడం అనే సందేహం వేధిస్తోంది. ఇదివరకు తనకు ఎదురే లేదని అనుకున్నా ఇప్పుడు చెల్లి రావడంతో తన ప్రస్థానం ప్రశ్నార్థకం కానుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
విజయమ్మ కూడా చెల్లి వైపు ఉండే అవకాశాలున్నాయి. ప్రతి మీటింగులోనూ జగన్ గురించి మాట్లాడి అతడిని అధికారంలోకి రావడానికి కారకులయ్యారు. కానీ జగన్ వారిని పట్టించుకోలేదు. అందుకే వారు వేరు కుంపటి పెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో జగన్ ఒంటరిగానే మిగిలిపోయారు. తల్లి, చెల్లిని దూరం చేసుకున్నారు. ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు.