JAISW News Telugu

AP Election Results : ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు వాళ్లవే, ఎవరి ధీమా వారిదే ?

AP Election Results

AP Election Results

AP Election Results : ఏపీలో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలపై  గతంలో ఏ ఎన్నికల్లో లేనంత ఉత్కంఠ నెలకొంది.  ఈ సారి ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి.  అధికారమే ధ్యేయంగా పార్టీలన్నీ తెగ శ్రమించాయి. పోలింగ్ పూర్తయిన వెంటనే గెలిచేది ఎవరన్న దానిపై మొదలైన సస్పెన్స్‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.  శనివారం ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించాయి అన్ని పార్టీలు.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ మళ్లీ అధికారం వైసీపీదే అంటుంటే.. మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ మేకర్ కూటమే అంటూ అంచనా వేశాయి.  దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ ఇప్పుడు మరింత పెరిగిపోయింది.

ఎగ్జిట్ పోల్స్ లో సర్వే సంస్థలన్నీ భిన్నమైన అంచనాలు ప్రకటించి పొలిటికల్ పార్టీలను కన్ఫ్యూజన్‌లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్‌ నిజమవుతాయని.. ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ అంతా ఫేక్ అంటూ రాజకీయ నేతలు విమర్శలు గుప్పించారు. ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ గందరగోళంగా ఉన్నాయని.. లోకల్‌ సర్వేలు తమకు పాజిటివ్‌గా ఉన్నాయని వైసీపీ పేర్కొంది.  ఇది ఇలా ఉంటే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిఓట్ల లెక్కింపు సమయంలో కన్ను ఆర్పకుండా  అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

 టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూటమికే సానుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించబోతున్నామన్నారు. దీంతో మళ్లీ వైసీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని చంద్రబాబు సూచించారు.  కౌంటింగ్‌ రోజు అప్రమత్తంగా ఉండాలని నేతలకు పిలుపు నిచ్చారు.  రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే గెలుపు తథ్యమన్నారు  బీజేపీ నేత సీఎం రమేష్. కౌంటింగ్‌లో కూటమి ఏజెంట్లు సహనం కోల్పోవద్దన్నారు.  మొత్తానికి తుది ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్‌ క్లియర్ పిక్చర్ ఇవ్వకపోవడంతో.. రేపు వెలువడనున్న ఫలితాల కోసం నేతలంతా ఉత్కంఠగా వేచి చూడాల్సిన పరిస్థితి.

Exit mobile version