AP CM : ఎవరు సీఎం అయితే బాగుంటది?

AP CM

AP CM

AP CM : తెలంగాణ ఉద్యమం కారణంతో రాష్ట్రము విడిపోయింది. ఆంధ్ర  ప్రదేశ్ రాష్ట్రము ఏర్పడ్డాక మొదటిసారి జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర భాద్యతలను నారా చంద్రబాబు నాయడు చేపట్టారు. ఆయన పదవీ కాలం పూర్తయిన తరువాత వచ్చిన 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలు ఆశించినంత మేరకు జరుగలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఉద్యోగులతో మెదులుకున్న విధానాల వలన వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఎదో సాధించి పెడతాడని భావించి అనుభవం ఉన్న వ్యక్తిని దించివేసి పరిపాలన అనుభవం లేని జగన్ ను అందలం ఎక్కించారు ప్రజలు.

గడిచిన పదేళ్ల కాలంలో ఇద్దరు సీఎం ల పనితీరును ప్రజలు చూశారు. పరిపాలన విధానం ఎలా ఉందొ తెలుసుకున్నారు. ఇప్పడు ఆ ఇద్దరిలో ఎవరు సీఎం అయితే బాగుంటది అనే ఆలోచనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పడటం విశేషం. ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రజల్లో కొందరు కూటమివైపు నిలబడగా, మరికొందరు మాత్రం వైసీపీ వెంట ఉన్నారు. ప్రజలు ఎటు ఉన్నప్పటికీ ఎన్నికల పోరు మాత్రం జగన్ కు, కూటమికి మధ్య జరుగుతున్న పోరాటంగానే చెప్పాల్సి ఉంటది. అదేవిదంగా ప్రజలు పదేళ్లలో ఇద్దరి పరిపాలన చూశారు. కాబట్టి ఆ ఇద్దరి పరిపాలన పై నేడు ఎవరినో ఒకరిని ఎన్నుకునే సంప్రదాయానికి తెరలేపారు.

రాష్ట్రము విడిపోయిన తరువాత ఆర్థికంగా చాలా నస్టపోయింది. అభివృద్ధిలో వెనుకబడి పోయింది. జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి పేరిట రెండు దఫాలుగా అభివృద్ధి అనే కెమిస్ట్రీ జరిగింది. సంక్షేమం, అభివృద్ధి పేరుతో అధికారం చేపట్టి పంచుకున్నట్టుగా చెరో ఐదేళ్లు పరిపాలన చేపట్టారు. చంద్రబాబు పరిపాలన చూసిన తరువాతనే, జగన్ కు పరిపాలన కట్టబెట్టారు. అంటే చంద్రబాబు పరిపాలన పై ఎక్కడో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇప్పడు జగన్ పరిపాలన చూశారు.

ఒకవేళ తాజా ఎన్నికల్లో జగన్ కు ప్రజలు భాద్యత అప్పగిస్తే చంద్రబాబు కంటే జగన్ పరిపాలన బాగుందని అర్థం. ఒకవేళ కూటమికి అధికారం కట్టబెడితే జగన్ కంటే చంద్రబాబు హయాంలోనే ప్రజలకు మేలు జరిగిందనే భావన స్పష్టమవుతుంది.

TAGS