ఇక ఉప ఎన్నికలు జరిగిన రాష్ట్రాల గురించి తెలుసుకుంటే అస్సాంలో ఐదు నియోజకవర్గా్లలో బైపోల్ నిర్వహించారు. అవి ధోలై, సిడ్లీ, బొగైగావ్, బెహల్, సమగురి ఇక్కడ వరుసగా బీజేపీ, యూపీపీ(ఎల్), ఏజీపీ, బీజేపీ, ఐఎన్‌సీ గెలుపు బాటలో ఉన్నాయి.
బిహార్ లో నాలుగు చోట్ల తరారి, రామ్ ఘర్, ఇమామ్ గంజ్, బెల్గంజ్ ఇక్కడ వరుసగా బీజేపీ, బీజేపీ, హెచ్ఏఎం (ఎస్), జేడీ (యూ) ముందంజలో ఉన్నాయి.
ఛత్తీస్ ఘడ్ లో ఒక నియోజకవర్గం రాయ్‌పూర్ సిటీ సౌత్ కు నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ, గుజరాత్ లో వాక్ లో ఐఎన్‌సీ, కర్ణాటకలో షిగ్గావ్, సండూర్, చన్నపట్నంకు కాంగ్రెస్, కేరళలలో పాలక్కాడ్ కు ఐఎన్ సీ, చెలక్కరలో సీపీఐ (ఎం) విజయం సాధించాయి. ఇక దేశం అంతా ఆసక్తిగా చూస్తున్న వయనాడ్ లో ప్రియాంక గాంధీ విజయం వైపునకు దూసుకుపోతున్నారు.
పశ్చిమ బెంగాళ్ లో సీతై-ఏఐటీసీ, మదారిహత్-ఏఐటీసీ, నైహతి–ఏఐటీసీ, హరోవా-ఏఐటీసీ, మేదినీపూర్-ఏఐటీసీ, తాల్డంగ్రా-ఏఐటీసీ విజయం సాధించాయి.