Jai Swaraajya TV Election Roundup PART-1 NTR District : మనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. నాడు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు పోటీ చేసినందున ఎన్నికల విషయంలో నియంత్రణ, సిద్ధాంతపరమైన విభేదాలు మినహా వ్యక్తిగత ధూషణలు, ఆరోపణలు కనిపించేవి – వినిపించేవి కావు. ఇప్పటికి 15 ఎన్నికలు జరిగాయి. 2024 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో జై స్వరాజ్య టీవీ ఎలక్షన్ రౌండప్:
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్లు : 4 కోట్ల 22 లక్షల 21 వేల 450 పైబడి ఉన్నారు.
మహిళా ఓటర్లు : 2 కోట్ల 3 లక్షల 85 వేల 851 మంది.
పురుష ఓటర్లు : 1 కోటి 98 లక్షల 31 వేల 791 మంది.
ఇతరులు : 3,808 మంది.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం శాసన సభ స్థానాలు: 175
శాసన మండలి స్థానాలు: 58
లోక్‌సభ స్థానాలు: 25
రాజ్యసభ స్థానాలు: 11
జిల్లాలు: 26
జడ్పిటిసిలు: 653
మండలాలు: 670
ఎంపీపీలు: 653
మున్సిపాలిటీలు: 71
రెవెన్యూ గ్రామాలు: 17,398
గ్రామ పంచాయతీలు: 12,918
నగర పంచాయతీలు: 25
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1952 నుంచి 2014 వరకు మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగగా, రాష్ట్ర విభజన అనంతరం 2014 లోనూ, 2019 లోనూ 2 సార్లు – వెరసి ఇప్పటికీ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఏ నియోజకవర్గంలో కుల ప్రాతిపదికన ఓటర్లు ఎందరు ఉన్నారు. ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో ఎన్ని సార్లు ఎంత మెజారిటీతో గెలిచారు పూర్తి వివరాలు సమీక్షిద్దాం.. అలాగే ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో ఏ ఏ సమస్యలు అభ్యర్థులకు సవాళ్లు విసురుతున్నదీ ముచ్చటిద్దాం..
ఎన్టీఆర్ జిల్లా :
ఏడు నియోజకవర్గాల సమాహారం ఈ ఎన్టీఆర్ జిల్లా. దివంగత నందమూరి తారక రామారావు పేరున ఓ జిల్లా ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కృష్ణాజిల్లాని రెండుగా విభజించిన నేపథ్యంలో ఏడు నియోజకవర్గాలను కలిపి ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేశారు. వాస్తవానికి ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు. కానీ పవిత్ర కృష్ణానది ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని తూర్పు భాగాన్ని కృష్ణాజిల్లాగా – పడమర భాగాన్ని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశారు సీఎం జగన్. వాస్తవానికి ఈ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలే.
ఈ ఏడు నియోజకవర్గాల నుంచి విజయవాడకు రోడ్డు, రైలు మార్గాలు, బస్సు, ఆటోల సౌకర్యం ఉండడంతో ఉదయం భోజనం చేసి విజయవాడ వచ్చి పని పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్తారు. రకరకాల వృత్తి పనులవారు గ్రామాల నుంచి విజయవాడ వచ్చి పని చూసుకొని వెళ్లడం జరుగుతుంది. జిల్లాస్థాయి న్యాయస్థానాలు, విద్యా వైద్యాలయాలు, హోల్ సేల్ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పత్రిక కార్యాలయాలు, కొత్త సినిమాలు విడుదలయ్యే ఆధునిక థియేటర్లు, ఆహ్లాదకరమైన నదులు, కాలువలు, సాంస్కృతిక ప్రదర్శనశాలలు ఉండటంతో పల్లెల్లోని సగం జనం ఏదో ఒక పని మీద విజయవాడ వచ్చి వెళుతుంటారు. ఈ జిల్లాకు గుండెకాయగా చెప్పుకోదగిన గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గా దశదిశలా వ్యాపించింది.
ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.
1. విజయవాడ తూర్పు
2. విజయవాడ పశ్చిమ
3. విజయవాడ సెంట్రల్
4. మైలవరం
5. నందిగామ
6. తిరువూరు
7. జగ్గయ్యపేట
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఓటర్లు: 16.75 లక్షల పైగా ఉన్నారు
పురుషులు : 8.17 లక్షల మంది పైగా ఉన్నారు
మహిళలు : 8.57 లక్షల మంది పైగా ఉన్నారు.
కృష్ణాజిల్లాలో మొత్తం ఓటర్లు: 15.18 లక్షల పైగా ఉన్నారు.
పురుషులు : 7.37 లక్షల మంది పైగా ఉన్నారు.
మహిళలు : 7.81 లక్షల పైగా ఉన్నారు. (నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కథనాలు చూడండి)
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం..
భిన్న జాతులు, కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం అఖండ భారతం. అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల వారు, కులాలు – మతాలు – తెగలవారు, వృత్తుల వారు ఈ రాష్ట్రానికి గుండెకాయ వంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఉన్నారు.
2024 జనవరి నాటికి..
మొత్తం ఓటర్లు: 2,48, 849 మంది
పురుష ఓటర్లు: 1,23,2018 మంది
మహిళలు: 1,25,596 మంది
ఇతరులు: 35 మంది
మొత్తం డివిజన్స్: 20 (1 నుంచి 13 వరకు, 15, 16, 17, 18, 19, 75, 76)
పోలింగ్ స్టేషన్స్: 235
ఒక్కో కేంద్రంలో దాదాపు 1,408 ఓటర్లు
మత పరంగా ఈ నియోజకవర్గంలో ఓటర్లు..
ముస్లింలు 15.37%
నగరాలు 10.19%
తెలగ కాపు బలిజ 10.15%
మాల 7.43%
వైశ్య 7.38%
మాదిగ 5.80%
రెడ్డి 4.76%
బ్రాహ్మణులు 4.72%
యాదవ గొల్ల మందడి 3.92%
వడ్డెర 3.78%
దూదేకులు పిన్నిజి 2.88%
శెట్టి బలిజ గౌడ 2.45%
మార్వాడి అగ్రవాల్ జైన్ గుజరాతి తదితరులు 2.15%
ఎస్టి ఇతరులు 2.06%
రెల్లి 1.97%
దివాంగులు పద్మశాలి 1.89%
ఆచారి విశ్వబ్రాహ్మణ కంసాలి 1.88%
కమ్మ 1.83%
రాజులు క్షత్రియులు 1.77%
చాకలి రజక 1.72%
నాయి బ్రాహ్మణులు మంగలి 1.66%
మత్స్యకారులు 1.57%
గవర్లు 0.66%
వెలమ 0.58%
ఓసి ఇతరులు 0.42%
క్రిస్టియన్స్ 0.42%
బీసీ ఇతరులు 0.36%
బిహారీలు 0.23%
కులాల వారీగా విజేతలు –
ముస్లింలు ఐదు సార్లు
నగరాలు రెండు
వైశ్య రెండు
కాపు ఒకటి
క్రిస్టియన్ ఒకటి
క్షత్రియ ఒక్క సారి
ఆది నుంచి ఈ నియోజకవర్గంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. చేపల మార్కెట్ – కూరగాయల మార్కెట్, హోల్సేల్ మార్కెట్, ఐరన్ యార్డ్, పూల మార్కెట్, రైల్వే వేగన్ యార్డ్, సిమెంట్ – వస్త్రాల దుకాణాలు – బంగారు షాపులు వగైరా వగైరా మార్కెట్లలో పనిచేసే శ్రామికులను యూనియన్ పేరిట సంఘటిత పరిచి వారి వేతనాలు, పనివేళలు, వైద్య సదుపాయాలు తదితరాలపై ట్రేడ్ యూనియన్స్ కార్మికుల జీవిత భద్రతకు; సమానమైన పనికి సమాన వేతనం ఇప్పించటం ఇలా కొన్ని కార్మిక ప్రయోజనకర పనులు చేసి వారి విశ్వాసాన్ని చురగొన్నారు.
ఇదే సమయంలో నిరాడంబరత, ప్రజాసేవ, మాటకు కట్టుబడి ఉండడం తదితర పనుల ద్వారా కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. ఫలితంగా ఎన్నికల పోరు ప్రధానంగా కమ్యూనిస్టు నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగింది. నగరాలు, ముస్లింలు వైశ్యులు, క్షత్రియుల ఎన్నిక వెనుక, తొలి దినాలలో కులం మతం కన్నా రాజకీయ పార్టీలు – యూనియన్ల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ మధ్యకాలంలో ప్రజాస్వామ్య విలువలు మరుగునపడి ధన స్వామ్య వ్యవస్థ బలపడింది..
వాస్తవానికి ఈ నియోజకవర్గం విజయవాడలో చాలా ధనికమైంది. కానీ ఆ సంపద అంతా 10 శాతం పెట్టుబడిదారుల చేతులలో ఉంది, 90 శాతం పేదలలో పేదలే..! సంక్షేమ పథకాలు, కులాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న ఓటర్లనూ – ఆలోచింపజేసి అతి ముఖ్య విషయాల ప్రస్తావన తరచుగా వినిపిస్తుంది.
అవి..
1) కృష్ణానది బ్యారేజ్ కి అవతలి వైపున రాజధాని, ఇవతల వైపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం దాదాపుగా రెండు చేతులు కలిపి నమస్కరించినట్లు కృష్ణా నదికి ఇరువైపులా ఉంటాయి. రాష్ట్ర రాజధాని అంశం అత్యంత ప్రధానమైన అంశం. రాష్ట్ర రాజధానిపై స్పష్టత ఇచ్చి అభ్యర్థి ఓటర్లను ఆకర్షించే అవకాశం ఎక్కువ.
2) హోల్ సేల్, రిటైల్, రోడ్డు మీద తోపుడు బండ్ల మీద వ్యాపారాలు ఇక్కడ చాలామందికి జీవనాధారం. ప్రభుత్వ – పోలీసుల సహకారం, కరెంటు బిల్లులు, రెవెన్యూ చెత్త పన్నులు, విద్య ఉపాధి అవకాశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
3) మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గంలో కష్టపడే వారు ఎక్కువ. ఉచితాల కన్నా ఉపాధికి, వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్టపడి పని చేయడానికి పని కావాలి, సంపద ఉన్నప్పుడే వ్యాపారాలు సాగుతాయి, మనీ రొటేషన్ ఉంటుంది అని నమ్మేవారు, కూర్చోబెట్టి మేపడాన్ని ఇష్టపడని వారు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.
హిందూ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో, అంతే సంఖ్యలో మసీదులు, చర్చిలు ఉన్నాయి. అలాగే జైన మందిరాలు ఉన్నాయి. ఉత్సవాలకు తరతరాలుగా లక్షల రూపాయలు ఖర్చుపెట్టే ధార్మిక కుటుంబాలు కూడా ఉన్నాయి.