AP Results-AI : ఏపీలో ఎవరు గెలుస్తారంటే.. ఏఐ చెప్పిన సమాధానమిదే..
AP Results-AI : ప్రస్తుతం ప్రపంచమంతా అత్యున్నత టెక్నాలజీతో నిండిపోయింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక ప్రపంచమే మారిపోయిందని చెప్పవచ్చు. మనిషి చేయలేని ఏ పనైనా ఏఐ సాంకేతికతతో చేయవచ్చు. మనకు తెలియని విషయాన్ని ఏఐని ఇట్టే సమాధానం చెబుతుంది. అందుకే తమకు తెలిసిన, తెలియని అనేక ప్రశ్నలను నెటిజన్లు ఏఐని అడుగుతుంటారు. వీటికి జెమినీ ఏఐ, మాయ ఏఐ అనేవి సమాధానాలు చెబుతున్నాయి. ఒక్కొక్కసారి వివాదం కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నలు.. తాజాగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏ ఇద్దరు కలిసినా.. ఏపీలో ఎవరు గెలుస్తారో అనే విషయంపైనే చర్చించుకుంటున్నారు.
ఈ ఉత్కంఠతోనే జనాలు ఏపీలో ఎవరు గెలుస్తారని సీనియర్ సెఫాలజిష్టులను అడిగితే కూడా సమాధానం చెప్పలేక.. వేచి చూడండి అంటూ తప్పించుకుం టున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఔత్సాహిక నెటిజన్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. చాట్ జీపీటీలైన మాయ ఏఐని ఆశ్రయించారు. ఏపీలో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వంటి కీలక ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో టచ్ చేసి చూడు తరహాలో.. టీడీపీ అధినేత ఎవరు? ఏపీ ప్రస్తుత సీఎం ఎవరు? అనే ప్రశ్నలు కూడా.. అడిగారు. ఈ రెండు ప్రశ్నలకు మాయ ఏఐ.. సరైన సమాధానాలే చెప్పింది.
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పింది. అదేవిధంగా ప్రజెంట్ సీఎం ఆఫ్ ఏపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని బదులిచ్చింది. ఇక, ఏపీలో ఎలా ఎన్నికలు జరిగాయి.. అంటే.. రాడికల్‌గా జరిగాయని.. చెప్పడం గమనార్హం. ఎక్కడెక్కడ హింస జరిగిందన్న ప్రశ్నకు కూడా సమాధానం సరిగానే చెప్పింది. తాడిపత్రి, పల్నాడు అని పేర్కొంది. ఇక, ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్నకు మాత్రం మాయ ఏఐ కూడా దాటవేసింది. ‘దీనికి సమాధానం నాకు తెలీదు. తెలిశాక చెబుతా అని చెప్పడం గమనార్హం. దీంతో ఏఐ కూడా అంచనా వేయలేక పోతోందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫలితాలకు మరో ఏడు రోజులే ఉండడంతో పార్టీల శ్రేణులు, అభ్యర్థులే కాదు సాధారణ జనాల్లో సైతం ఉత్కంఠ పెరిగిపోతోంది.