Virat Kohli : ఇంగ్లండ్ తో సిరీస్ లో కోహ్లి స్థానంలో ఎవరికి స్థానం దక్కుతుందో?
Virat KohliVirat Kohli : జనవరి 25 నుంచి ఇంగ్లండ్ తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందులో మొదటి రెండు మ్యాచ్ లు హైదరాబాద్, విశాఖపట్నంలో జరగనున్నాయి. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది.
కోహ్లి స్థానంలో ఎవరిని తీసుకుంటారో తెలియడం లేదు. ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. రంజీలో వీరు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన ప్రాక్టీసులో వీరి ఆటతీరు బాగుండటంతో వారిలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియడం లేదు. ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో సర్పరాజ్ అదరగొట్టాడు.
పేస్ అండ్ స్పిన్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొని రజత్ ప్లస్ పాయింట్లు సాధించాడు. 35 ఏళ్ల పూజారా రంజీ ట్రోఫీలో జార్ఖండ్ పై డబుల్ సెంచరీ చేశాడు. బ్యాటింగ్ లో తన సత్తా చాటుతున్నాడు. దీంతో పూజారా మళ్లీ జట్టులోకి రావడానికి ఇదే మంచి సమయం అంటున్నారు. ఇలా ఈ ముగ్గురిలో ఎవరిని కోహ్లి స్థానంలో తీసుకుంటారో అని చూస్తున్నారు.
ఇటీవల భారత్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న రజిత్ పాటిదార్ ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో వరుసగా 151,111 పరుగులు చేయడం విశేషం. ఈనేపథ్యంలో విరాట్ కోహ్లి స్థానంలో ఎవరిని తీసుకుని మ్యాచ్ లు కొనసాగిస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి మెలకువలు ప్రదర్శించిన వారికి చోటు దక్కే సూచనలున్నాయని చెబుతున్నారు.