Sri Lanka Vs South Africa : టీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య అసలైన పోరు సోమవారం రాత్రి జరగనుంది. ఇప్పటి వరకు పసికూనల మధ్య జరిగిన మ్యాచులు కూడా ఆసక్తికరంగా మారడంతో పెద్ద జట్ల మధ్య మ్యాచ్ లపై మరింత ఫోకస్ పెరిగింది. నసవు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం న్యూ యార్క్ లో ఇండియా కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొత్త పిచ్, కొత్త వేదికలో ఇరు జట్లకు మొదటి మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది.
ఇప్పటి వరకు టీ 20 వరల్డ్ కప్ లో నాలుగు సార్లు ఇరు జట్లు ఢీకొనగా.. సౌతాఫ్రికా మూడు సార్లు, శ్రీలంక ఒక సారి గెలిచాయి. శ్రీలంక కెప్టెన్ గా వాహిందు హసరంగా, మొదటి సారి తన సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడు. మహీషా పతిరన, హసరంగా, దిల్షాన్ మధుశంకా మెయిన్ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు. సౌతాఫ్రికాలో హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్లబ్స్ తో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ తో బలంగా కనిపిస్తోంది.
శ్రీలంక బౌలర్లకు, సౌతాఫ్రికా బ్యాటర్లకు మధ్య పోరు కచ్చితంగా నడవనుంది. 2014 లో ఇండియాపై గెలిచి టీ 20 వరల్డ్ కప్ నెగ్గిన శ్రీలంక పదేళ్ల తర్వాత మళ్లీ కప్ పై కన్నేసింది. ఈ సారి కొత్త కెప్టెన్, కొత్త బ్యాటర్లతో టైటిల్ ఎలాగైన గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. సౌతాఫ్రికా కథ వేరేలా ఉంది. ఇప్పటి వరకు అన్ని సెమీ ఫైనల్లో ఓడుతూ వస్తున్న ఈ టీం.. ఈ సారి ఎలాగైనా టీ 20 వరల్డ్ కప్ నెగ్గి దక్షిణాఫ్రికాకు సెమీఫైనల్ గండం తొలగించుకోవాలని కోరుకుంటోంది.
సౌతాఫ్రికా గత వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాపై ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. సౌతాఫ్రికా ఈ సారి బ్యాటింగ్, బౌలింగ్ లో అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. అండ్రీ నోకియా, రబాడ, కొయోట్జి లాంటి పేసర్లతో స్పిన్నర్స్ విభాగంలో కేశవ్ మహారాజ్, శంసిలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. శ్రీలంక, సౌతాఫ్రికా పోరులో ఎవరూ గెలుస్తారో చూడాలి.