Narendra Modi : భారత దేశ ప్రధాన మంత్రిగా మూడోసారి మోదీ నే అవుతారని బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. పక్క నాలుగు వందల సీట్లు గెలుస్తామని బహిరంగానే చెప్పేస్తున్నారు. కానీ ఆలా చెప్పుకోవడంతో ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లిందని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగ మార్పు జరుగు తుందని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారంతో తెలంగాణ లో బీజేపీ కి ఎదురుదెబ్బ తగిలింది. దింతో కొంత నష్టాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోసారి ప్రధాన మంత్రిగా మోదీ భాద్యతలు చేపడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరుగుతుందని రాజకీయ మేధావులు ఆలోచనలో పడ్డారు.
బీజేపీ కనీసం సొంత జెండాపై 200 పైగా స్థానాల్లో విజయం సాధించినా దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు తమ సొంత అవసరాల కోసం ఢిల్లీ పార్టీ కార్యాలయం ముందు వరుస కట్టడం ఖాయం. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు సైతం మద్దతు ఇస్తామని ప్రకటించే అవకాశం కూడా ఉంది. కేంద్రంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటె మేము కూడా ఆరోగ్యముగా ఉంటామనేది గడిచిన పదేళ్లలో తెలిసిపోయింది. కాబట్టి ఆరోగ్యం కోసమైనా పలు ప్రాంతీయ పార్టీల నేతలు మోదీ కి మద్దతు ఇస్తామని ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎలాగూ బీజేపీ మద్దతుతోనే ప్రజల్లోకి వెళ్లారు. మోదీ మూడోసారి పరిపాలన పగ్గాలు చేపడితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. నిధులు తెచుకోవచ్చు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా రాష్ట్రాన్ని ప్రజల ఆశయాలకు తగిన విదంగా అభివృద్ధి చేసుకోడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగూ మోదీని పెద్దన్న అని సంబోధిస్తున్నారు. అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానితో కయ్యం పెట్టుకోకుండా స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రము మంచి కోసమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు వేరు, పరిపాలన వేరు అంటూ సమర్ధించుకున్నారు రేవంత్ రెడ్డి.
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ కష్టాలతో పాటు నష్టాలను కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే పదేళ్లు అరణ్య వాసం చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ దశల వారిగా ఎదిగి పరిపాలన చేతపట్టింది. కానీ కాంగ్రెస్ పరిస్థితి అందుకు బిన్నంగా కనబడుతోంది. రాబోయే ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీల పక్కన చేరేవిదంగా బీజేపీ తన రుచిని చూపించడం ఖాయం.