Team India Captain : టీం ఇండియా టీ 20 ప్రపంచ కప్ నెగ్గి ఊపు మీద ఉంది. అయితే రోహిత్ శర్మ మ్యాచ్ గెలిచిన అనంతరం తనకు ఇదే చివరి టీ 20 మ్యాచ్ అని ఇంతకంటే గొప్పగా ముగింపు పలకడం సాధ్యం కాదని తేల్చేశాడు. దీంతో ఇప్పుడు టీం ఇండియా కెప్టెన్సీ రేసులో పడింది. వెస్టిండీస్, అమెరికాలో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా చేసిన హర్దిక్ పాండ్యా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.
ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్ లో తీవ్ర ఒత్తిడిని తట్టుకుని అద్భుతంగా బౌలింగ్ చేసి మిల్లర్ ను, రబాడను ఔట్ చేయడమే కాకుండా ఇండియాకు టీ 20 టైటిల్ ను అందించాడు. దీంతో టీం ఇండియా టీ 20 మ్యాచ్ లకు హర్దిక్ కెప్టెన్సీకి సరిపాతాడని అనుకుంటున్నారు. హర్దిక్ కు కూడా ఇంతవరకు ఐపీఎల్ లో గుజరాత్ టీంకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. మొదటి సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ను టైటిల్ విజేత గా నిలబెట్టాడు.
సూర్య కుమార్ యాదవ్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన 7 మ్యాచుల్లో అయిదింట గెలిచింది. యాక్సిడెంట్ లో గాయపడి కోలుకుని ప్రస్తుతం టీం ఇండియాలో వికెట్ కీపర్ గా స్థానం సంపాదించుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. టీం ఇండియా కెప్టెన్ గా పంత్ ను నియమిస్తారనే టాక్ నడుస్తోంది. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
ఐర్లాండ్ తో జరిగిన మూడు మ్యాచుల టీ 20 సిరీస్ కు జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించాడు. సక్సెస్ ఫుల్ గా టీంను నడిపించి గెలిపించాడు. బుమ్రా వ్యుహ చతురత, ఫ్లాన్, క్రమశిక్షణ ఎక్కువగా పనికొస్తుందని అంటున్నారు. మరి టీ 20ల్లో ఎవరూ కెప్టెన్ అవుతారో చూడాలి. ప్రస్తుతం జింబాబ్వే తో జరగబోయే అయిదు మ్యాచుల టీ 20 సిరీస్ కు గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.