Nakka Anand Babu : సిఎం జగన్ పై రాయి దాడి మరో కొత్త డ్రామా అని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. విజయవాడలో ఎవరో తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్ నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులో ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో నాటకం ఆడి అమాయక దళిత యువకుడు ఐదేళ్లు జైలులో ఉన్నాడు. మళ్లీ ఈ రాయి దాడిలో ఏ దళితుడిని బలి చేస్తారోనని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన సీఎంకే భద్రత లేదంటే అది జగన్ చేతకానితనమని, ఇది ముమ్మాటికి ఐ ప్యాక్ ఆధ్వర్యంలో పథకం ప్రకారం జరిగిన దాడిగా ఆయన ఆరోపించారు. ఈ సంఘటనతో టిడిపికి ఏం సంబంధమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైకాపా ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.