CM Revanth : రాజకీయ నాయకులు ప్రసంగాలు చేస్తుంటారు. ప్రజల సమక్షములోనే అధిక ప్రసంగాలు చేస్తారు. ఒక నాయకుడు మరొక నాయకుడిపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. విమర్శకు ప్రతి విమర్శ వెంట వెంటనే చేసుకుంటారు. ప్రజల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాత్రం తమ ప్రసంగాల్లో సలహాలు, సూచనలు అసలే ఉండవు. ఏకాదటిగా సవాల్ విసురుకోవడమే బహిరంగంగా కనబడుతుంది. విమర్శలు,ప్రతి విమర్శలు, అభివృద్ధిపై సవాల్ చేసుకోవడం వరకు పరిమితం అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. వాటిని ప్రజలకు చెప్పే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కు కూడా ఎలాంటి ఇబ్బందులు రావు.
కానీ, బహిరంగ వేదికలపై రాజకీయ నాయకులు తిట్టుకునే బూతు పురాణం, అసభ్యకరమైన మాటలు, చెప్పుకోడానికి వీలు కానీ పదాలే అటు ప్రజలను, ఇటు మీడియాను ఇబ్బందిపెడుతున్నాయి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా భాద్యతగా వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకులు మాట్లాడే భాషా తో బాధ్యతతో ఉన్న మీడియా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. నాయకులూ మాట్లాడుకున్న బూతు మాటలను ప్రసారం చేసినందుకు ఆ మీడియా సంస్థ వారిని జైలు లో పెట్టాలి అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెలవిచ్చారు. అంటే నాయకులు తిట్టుకుంటారు. అధికారం ఎక్కడ ఉంటె అక్కడ కండువా కప్పుకుంటారు. ఆయా సమయాల్లో వారి వదిన భాషా ప్రసారం చేసినందుకు మీడియా భాద్యత వహించాలి. కానీ అప్పుడు తిట్టిన నాయకున్ని ఇప్పుడు చేర్చుకోవడంలో అభిమానం అడ్డురాదు. కానీ ప్రసారం చేసిన మీడియా ను మాత్రం జైలు లో పెట్టాలి. ఇది ఎంతవరకు సమంజసమని మేధావులు రేవంత్ రెడ్దని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ నాయకులు మాట్లాడే బూతు మాటలను మీడియా సంస్థలు ప్రసారం చేయరాదు. ప్రసారం చేయకండి. దానివలన ప్రజలకు ఇబ్బంది. నాయకులు మాట్లాడిన బూతు మాటలను ప్రసారం చేసిన మీడియా సంస్థ వారిని జైలు లో పెడితే ఎవరు కూడా అటువంటి మాటలను ప్రసారం చేయరు అంటూ రాష్ట్ర ముఖ్య మంత్రి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ లో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.