JAISW News Telugu

Rashmika Rumours : ‘ఎవరు చెప్పారు?’: పుకార్లను కొట్టిపారేసిన రష్మిక

FacebookXLinkedinWhatsapp
Rashmika Rumours

Rashmika Rumours

Rashmika Rumours : గతేడాది సూపర్ బిజీగా ఉన్న రష్మిక మందన్న ‘యానిమల్’ సక్సెస్ తో క్లౌడ్ నైన్ లోకి వెళ్లింది. తన ‘శ్రీవల్లి 2.0 (పుష్పలో రష్మిక పేరు)’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటుంది. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నా.. కూడా ట్విటర్, ఇన్ స్టా చూడడం మానడం లేదు ఈ సుందరి.

షూటింగ్ బిజీ టైమ్ లో కూడా రష్మిక ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు చెక్ పెట్టింది. ఆమె తన ఫాలోవర్స్ లో చాట్ చేస్తుంటుంది. స్క్రిప్ట్ నచ్చకపోయినా శర్వానంద్, కిశోర్ తిరుమల లాగానే రష్మిక మందన కూడా ‘ఆడవాళ్లు మీ కోసం జోహార్లు’ సినిమాకు సైన్ చేసిందా? అని ఓ ట్విటర్ యూజర్ ప్రశ్నించారు.

రష్మిక వెంటనే ఆ రూమర్ ను తోసి పుచ్చింది. స్క్రిప్ట్ నచ్చితేనే సినిమాలకు సైన్ చేస్తానని, ఆడవాళ్లు మీకూ జోహార్లు టీంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని పుష్ప లేడీ చెప్పింది.

‘ఎవరు చెప్పారు? 🤷🏻 ♀️🤦🏻 ♀️ స్క్రిప్ట్ మీద నమ్మకంతోనే సినిమాలు చేస్తాను. ఆ సినిమాల్లో నటించిన వారు మరియు సిబ్బంది అందరితో కలిసి పనిచేయగలగడం గౌరవంగా భావిస్తాను. ఈ నిరాధారమైన వార్తలన్నీ ఎక్కడి నుంచి 🤷🏻 ♀️🤦🏻 ♀️ మొదలవుతాయోనని నేను ఆశ్చర్యపోతున్నాను.’ అని చెప్పింది.

ఇదిలా ఉంటే రష్మిక తెలుగులో రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్, హిందీలో చావా సినిమాలతో బిజీగా ఉంది. యానిమల్ సక్సెస్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత క్రేజ్ హీరోయిన్ గా మారింది.

Exit mobile version