Kajal Aggarwal : ఒకప్పుడు కాజల్ అగర్వాల్ కి సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె డేట్స్ కోసం పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సైతం ఎదురు చూసేవారు. సౌత్ లో ఒక్క రజినీకాంత్ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన ఈమె నటించేసింది. ఒక పక్క గ్లామర్ తో, మరోపక్క నటనతో కాజల్ అగర్వాల్ ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసింది. అయితే ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుండి ఆమెకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
‘సత్యభామ’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి కానీ, ఈమెకి సమంత, నయనతార మరియు అనుష్క కి ఉన్నంత సోలో మార్కెట్ లేదు. అందుకే పెళ్లి తర్వాత ఈమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ సమయం లో ఆమె మన తెలుగు లో ‘ఆచార్య’ , ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలు చేసింది.
వీటిలో ఆచార్య సినిమాలో ఆమె నటించినప్పటికీ ఆమె సన్నివేశాలు సినిమాకి అడ్డు వస్తుంది అనే కారణంతో ఎడిటింగ్ లో ఆమె సన్నివేశాలు మొత్తం తొలగించేసారు. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఆమెకు కొరటాల శివ ఎంత బలహీనమైన క్యారక్టర్ రాసి ఉంటాడో అని. మరోపక్క బాలయ్య తో చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యినప్పటికీ కూడా, అసలు నటనకి ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర పోషించింది, కాజల్ తన రేంజ్ ని మర్చిపోయి ఇలాంటి సినిమాల్లో ఎలా నటిస్తుంది అంటూ పెదవి విరిచారు ఆమె అభిమానులు. కాజల్ ఇలా ఏ మాత్రం బలం లేని పాత్రలు చెయ్యడానికి కారణం ఆమె భర్తే అని అంటున్నారు ఇండస్ట్రీ కి సంబంధించిన కొన్ని విశ్వసనీయ వర్గాలు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ పక్కన అవకాశం వస్తే వదులుకోకూడదు. కనీసం వాళ్ళ సీనియారిటీ కి అయినా మర్యాద ఇచ్చి చెయ్యాలి అని బలవంతంగా ఒప్పించి చేయించాడట.
దీంతో మేకర్స్ కూడా కాజల్ కి అలాంటి రోల్స్ అయితేనే ఇస్తారని, లేదంటే కుర్ర హీరోయిన్స్ వైపే చూస్తున్నారని టాక్. అయితే ఆమె అభిమానులు మాత్రం కాజల్ ని ఒక పవర్ ఫుల్ విలన్ రోల్ లో చూడాలని కోరుకుంటున్నారు. కాజల్ ఇన్ని సంవత్సరాల తన కెరీర్ గ్లామర్ పాత్రలు తప్ప నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యలేదని, అందుకే ఆమెకి అవకాశాలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారని, ఒక ఆర్టిస్టు లో యాక్టింగ్ స్కిల్స్ బయట పడాలంటే విలన్ రోల్ ద్వారానే సాధ్యం అని, సమంత, తమన్నా వంటి హీరోయిన్స్ కూడా విలన్ రోల్స్ లో మెప్పించడం వల్లే ఇప్పుడు వాళ్ళ కెరీర్ ఆ రేంజ్ లో ఉంది అని అంటున్నారు. కాజల్ కి కూడా విలన్ రోల్స్ చెయ్యాలని ఉంది కానీ, ఆమెని ఆ యాంగిల్ లో ఏ డైరెక్టర్ కూడా ఇప్పటి వరకు చూడలేదు. భవిష్యత్తులో ఏమైనా చేస్తుందేమో చూడాలి.