actress in Salar : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘సలార్’. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శ్రీకాంత్, శ్రుతిహాసన్, జగపతి బాబు కూడా నటించి మెప్పించారు. ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఈ మూవీలో తన విశ్వరూపం చూపించాడు. ఇందులో ప్రభాస్ ఆటిట్యూడ్, మేనరిజం ఫ్యాన్స్ తో పాటు విమర్శకులను ఆకట్టుకుంది. డైలాగ్స్ తక్కువే అయినా మేనరిజంతో అదరగొట్టాడు. కొనసాగింపుగా సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమాలో కనిపించిన ఒక నటి గురించి ప్రస్తుతం వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ ను కాపాడే సమయంలో నటి బీడీ తాగుతూ పచ్చబొట్టు వేస్తుంది. ఇందులో ప్రభాస్ తోపాటు ఈ నటి ఇచ్చిన హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఏ పచ్చబొట్టు వేయాలని అడిగితే నా కళ్లల్లో కనిపించేది’ అంటూ ప్రభాస్ ఆమె దగ్గరున్న బిడీ తీసుకొని తాగుతాడు డార్లింగ్. అఫ్పుడు ప్రభాస్ కళ్లల్లోకి చూస్తూ పచ్చపొడుస్తుంది. ఆ నటి ఎవరో తెలుసా.. బుల్లితెరపై ఆమె ఫేమస్ ఆర్టిస్ట్.
ఆమె పేరు ‘జయవాణి’. బుల్లితెరపై అనేక సీరియల్స్ లో విలన్ పాత్రల్లో కనిపిస్తుంది. విక్రమార్కుడులో రవితేజ జుట్టు పట్టుకొని మరీ గొడవపడుతుంది. జయవాణి చాలా సినిమాల్లో నటించింది. బుల్లితెరపై సీరియల్స్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం చిన్ని సీరియల్స్ లో కావేరిని చిత్ర హింసలు పెట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది.