Test Series England : ఇండియన్ క్రికెట్ టీంలో సభ్యులు ఎక్కువగానే ఉన్నారు. దీంతో మూడు ఫార్మాట్లలో ఆటగాళ్లను సర్దుతున్నారు. ఒక ఫార్మాట్ లో అవకాశం దక్కని వారికి మరో ఫార్మాట్ లో స్థానం కల్పిస్తున్నారు. ఒక మ్యాచ్ లో ఓడిపోతే దానికి రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటోంది. అన్ని దేశాల క్రికెట్ టీములకు ఇది కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇండియన్ టీములో ఎక్కువ మంది ఉండటం వల్ల బీసీసీఐ మూడు ఫార్మాట్లలో ప్లేయర్లను ఎంపిక చేస్తున్నారు.
ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్ ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో రెండు టెస్టులకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో తెలియడం లేదు. ఇప్పుడు వికెట్ కీపర్ సమస్య కూడా వేధిస్తోంది. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ సిరీస్ కు కీపింగ్ చేయడం లేదు. దీంతో కొత్త వారిని తీసుకోవాలని కోచ్ ద్రావిడ్ సూచిస్తున్నారు.
ఈనేపథ్యంలో కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాతో సూపర్ గా ఆడుతున్న క్రమంలో అతడిచేత కీపింగ్ చేయించడం మంచిది కాదనే వాదన వస్తోంది. అందుకే కేఎస్ భరత్ ను గానీ ధ్రువ్ జురెల్ ను కానీ కీపర్ గా తీసుకోవాలనే ఆలోచన ఉందని ద్రావిడ్ వెల్లడించాడు. కేఎల్ రాహుల్ కు ఫ్రీడం దొరుకుతుందనే ఉద్దేశంతోనే అతడికి విశ్రాంతి ఇస్తున్నట్లు ప్రకటించాడు.
రిషబ్ పంత్ రీ ప్లేస్ మెంట్ గా టీమ్ లోకి రానున్నట్లు సమాచారం. కేఎస్ భరత్ మళ్లీ వికెట్ కీపర్ గా రాబోతున్నాడని అంటున్నారు. ధ్రువ్ జురెల్ కూడా పోటీలో ఉన్నారు. ధ్రువ్ జురెల్ తో పోల్చితే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా కేఎస్ భరత్ కు మంచి అనుభవం ఉన్నందున అతడికే ఎక్కువ అవకాశాలున్నట్లు చెబుతున్నారు.