Rakul Preet Singh Wedding : తెలుగుతో పాటు తమిళం, హిందీ ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రతీత్ సింగ్. ఆమె త్వరలో వివాహం చేసుకోబోతోందని తెలిసిందే. తన ప్రియుడు జాకీ భగ్నానీని రకుల్ వివాహం చేసుకోబోతున్నాడట. ఫిబ్రవరి 22వ తేదీ వీరి వివాహం గోవాలో జరుగనుంది.
వివాహానికి ఇంకా నెలలోపు మాత్రమే గడువు ఉండడంతో ఈ జంట పనుల్లో నిమగ్నమయ్యారు. వెడ్డింగ్ కు కావాల్సిన పనులను వేగంగా చేసుకుంటున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారికి తమ మ్యారేజ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఫేమస్ వీడియో గ్రాఫర్ విశాల్ పంజాబీని ఎంచుకున్నారు. విశాల్ ఈ జంట డీ-డూపే డాక్యుమెంట్ చేయడంతో పాటు వీరి కోసం అద్భుతమైన థీమ్ కంపోజ్ చేస్తారు.
విశాల్ సెటబ్రెటీ సర్కిల్ లో ఫేమస్. అనుష్క శర్మ – విరాట్, దీపికా పదుకోణ్-రణవీర్ సింగ్ వంటి హై ప్రొఫైల్ వివాహాలకు ఈయనే వీడియోగ్రాఫర్. కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా వివాహానికి కూడా అతడే ఫొటో గ్రాఫర్. గోవాలో జరగనున్న రకుల్ – భగ్నానీ వివాహాన్ని కూడా ఇతడే కవర్ చేస్తాడు. బీచ్ వెడ్డింగ్ చిల్లింగ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
జాకీ భగ్నానితో తనకున్న పరిచయం, ఆయన బిహేవియర్ తనను చాలా ఆకట్టుకుందని అందుకే ఆయనను లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకున్నానని గతంలో ఒక ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. షూటింగ్ ప్రెషర్స్ లో కొన్ని రోజులు దూరంగా ఉన్నా ఆయన నన్ను అర్థం చేసుకుండాడని చెప్పింది. సేమ్ ఇండస్ట్రీ కాబట్టి ఆయనకు అన్నీ తెలుసని చెప్పింది.