Richest MLA : దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఎవరంటే?

richest MLA
Richest MLA : మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా దేశంలోనే అత్యంత సంపన్నమైన శాసనసభ్యుడిగా తేలింది. ఆయన ముంబైలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నిర్వహించిన ఒక విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. ఈ విశ్లేషణ ఎమ్మెల్యేల ఆర్థిక, నేర మరియు రాజకీయ నేపథ్యాలను పరిశీలించింది.