Highest Paid Player in RCB : ఐపీఎల్ సంరంభం వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో మొదలు కానుంది. దీంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. పనికి రాని వారిని వెనక్కి పంపేస్తూ కావాల్సిన వారి కోసం డబ్బులు ఖర్చు పెట్టేందుకు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న హార్థిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ కు వెళ్లాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ బెంగుళూరుకు వచ్చాడు. అతడికి రూ.17.5 కోట్ల చెల్లించి ఆర్సీబీ అతడిని కొనుగోలు చేయడం గమనార్హం. దీంతో మాజీ టీమిండియా సారధి విరాట్ కోహ్లి కంటే గ్రీన్ కు ఎక్కువ చెల్లిస్తున్నారు. విరాట్ కు రూ.17 కోట్లు చెల్లిస్తుండగా గ్రీన్ కు మాత్రం రూ.17.5 కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో ఆర్సీబీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
2018 వేలంలో కోహ్లిని రూ. 17 కోట్లకు ఆ జట్టు తిరిగి తీసుకుంది. ఇప్పుడు గ్రీన్ ను కూడా ఆర్సీబీ మళ్లీ తీసుకురావడంతో అతడు తీసుకుంటున్న డబ్బుకు న్యాయం చేస్తాడో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆర్సీబీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. దీంతో ఐపీఎల్ సంరంభంలో ఆటగాళ్ల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే పది జట్లు పాల్గొంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్థిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ కు రావడంతో సమీకరణలు మారుతున్నాయి. ఆటగాళ్లు మారుతుండటంతో ఐపీఎల్ ఆటల్లో మజా రానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆటల్లో రంజింపచేసే విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది.