JAISW News Telugu

YS Sharmila : షర్మిలకు కాబోయే కోడలు ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

YS Sharmila : వైఎస్ షర్మిల గురించి అందరికి తెలుసు. రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆమెకు రావాల్సిన గౌరవం దక్కింది. ఆమె కుమారుడు రాజారెడ్డి ప్రియ అట్లూరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి పెళ్లి పత్రికను ఇడుపుల పాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఉంచి పూజలు జరిపించి వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలకు కాబోయే కోడలు ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరనే చర్చలు వస్తున్నాయి. ప్రియ అట్లూరి బ్యాక్ గ్రౌండ్ ఎవరు? ఆమె ప్రస్థానం ఏమిటనే వాదనలు వస్తున్నాయి. దీంతో ప్రియ అట్లూరి కుటుంబ నేపథ్యం ఏమిటనే చర్చలు సహజంగానే రావడం ఖాయం.

అట్టూరి ప్రియ అనిల్ స్నేహితుడైన అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అని చెబుతున్నారు. అమెరికాలో స్థిరపడిన అట్లూరి శ్రీనివాస్ బ్రదర్ అనిల్ కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటారని సమాచారం. దీంతో ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు బాగుండటంతో వారి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. రాజారెడ్డి, ప్రియ మధ్య ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందని చెబుతున్నారు. వీరి కులాలు వేరు కావడంతో ఇప్పుడు వారి మనుగడ ఎలా ఉంటుందనే దానిపైనే ప్రచారం సాగుతోంది.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన షర్మిలకు ఎలా కుదురుతుందో అనే అనుమానాలు వస్తున్నాయి. అట్లూరి ప్రియ చంద్రబాబు బంధువు అని చెబుతున్నారు. ప్రస్తుతం షర్మిల జగన్ ను కాదని బయటకు వెళ్లడంతో ఇప్పుడు ప్రియ ఎవరైనా పట్టించుకోరని అంటున్నారు. చంద్రబాబుకు ప్రియకు మధ్య ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు ప్రియ కుటుంబ నేపథ్యం గురించి పలు రకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రియ గురించి పలు రకాల చర్చలు వస్తున్నాయి. ఆమె ఎవరు? ప్రస్తుతం షర్మిల కోడలుగా రావడంతో ఏవైనా మార్పులు వస్తాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో ప్రియ అట్లూరి వల్ల షర్మిల కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రావని తెలుస్తోంది.

Exit mobile version