Pawan Kalyan Target : తెలంగాణలో పవన్ కల్యాణ్ టార్గెట్ ఎవరు?
Pawan Kalyan Target in Telangana : తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసి రాష్ట్రంలో పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీల కోసం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో నిలవనున్నారు. ఈమేరకు రేపు కొత్తగూడెం, సూర్యపేట, దుబ్బాక మీదుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యపేట, 3 గంటలకు దుబ్బాకలో ప్రచారం చేపట్టనున్నారు.
ఇందులో ఎవరిని టార్గెట్ చేస్తారు. కేసీఆర్ నా లేక రేవంత్ రెడ్డినా అనే అనుమానాలు వస్తున్నాయి. బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ ప్రకటించింది. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో బీజేపీ పోటీలో ఉంది. 25న తాండూరు, 26న కూకట్ పల్లి నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేపట్టనున్నారు.
తెలంగాణలో టీడీపీకి మిత్రపక్షంగా తెలంగాణలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో ఎవరిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారనే విషయంలో సందిగ్దం నెలకొంది. ఇక్కడ లభించే ఓట్లతో ఏపీలో పవన్ తో ప్రచారం చేయించాలా? వద్దా అనే ఆలోచనలో పడింది. దీంతో పవన్ తెలంగాణలో ఎవరిని విమర్శిస్తారనే వాదనలు వస్తున్నాయి.
కేసీఆర్ పై ఇప్పటికి ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీకి శత్రువుగా కాంగ్రెస్ మిగిలింది. దీంతో ఇందులో ఏ పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారో తెలియడం లేదు. రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది. పవన్ ప్రచార సభల్లో కేసీఆర్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం అందరిలో ఆసక్తి పెంచుతోంది.