Masood Azhar : ఉగ్రవాదులను ఎవరు ఏసేస్తున్నారు..? మసూద్ అజహర్ హతం కూడా అలాంటిదే!
Masood Azhar : భారత్ కు చేటు చేసిన.. చేటు చేయాలని చూస్తన్న ఉగ్రవాదులు వరుసగా హతం అవుతున్నారు. అసలేం జరుగుతుంది. వారిని ఎవరు చంపుతున్నారు. వారికి బ్రతికే హక్కు లేని ఐక్యరాజ్య సమితి చెప్తుంది. ‘ఉగ్రవాదులతో దేశాలు పతనం అవుతాయి.. వారిని మార్చండి లేదంటే.. అంతం చేయండి’ అని ఐక్యరాజ్య సమితి చెప్తూ వస్తుంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్ లాంటి దేశాలు రొట్టె పిండికి కూడా కొట్టుకునే రోజులు వచ్చాయి. అయినా ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. ప్రపంచం అంతా టెక్నాలజీ, పురోగతి వైపు పయనిస్తుంటే పాక్ మాత్రం ఇంకా రొట్టె పిండి కోసం కొట్టుకునే రోజుల కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు సమస్య రొట్టె పిండిది కాదు.. సందర్భోచితంగా చెప్పడం జరిగిందంతే.
విదేశాంగ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ ‘ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే ఓపిక ఇప్పుడు భారత్ కు లేదు’ అని చెప్పారు. భారత్ జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికపై చెప్తూ వస్తుంది. జీ20 సమ్మిట్ కు ముందు కెనెడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది సుఖా దునేకే హతం అయ్యాడు. అయితే ఆ హత్య చేసింది భారత్ అంటూ కెనెడా అంతర్జాయతీయ సమాజంపై మొత్తుకుంది. దానికి సంబంధించిన సాక్షాలు లేవంటూ అంతర్జాతీయ సమాజం కెనెడా మాటలను పట్టించుకోలేదు. కానీ జీ 20 సమ్మిట్ లో ఇటు భారత్, అటు కెనెడా ప్రతినిధులుగా ఉండడంలో భారత్ స్నేహ హస్తం చాస్తున్నా.. కెనెడా మాత్రం పట్టించుకోలేదు. దీంతో భారత్ కూడా కెనెడాను నిందించలేదు, సమర్తించనూ లేదు.
ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బాంబు పేలుడుతో హతం అయ్యారు. సోమవారం ఉదయం 5.30 గంటల మధ్య బవల్‌పూర్ మసీదు నుంచి బయటకు వచ్చి కారులో వెళ్తుండగా దాడి జరిగింది. ఇందులో అజహర్ మరణించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ దీన్ని ఒప్పుకోలేదు. ఇలా పాకిస్తాన్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు 8 మంది వరకు హతమయ్యారు. గత కొన్ని రోజుల క్రితం మసూద్ అజహర్ మీ దేశంలో ఉన్నట్లు తెలుస్తుందని, వెంటనే అప్పగించాలని భారత్ పాకిస్తాన్ ను హెచ్చరించింది. దీంతో పాక్ తమ దేశంలో అతను లేడని ఒక వేళ ఉన్నా కూడా అప్పగించే ప్రసక్తే లేదన్నట్లుగా మాట్లాడింది.
మసూద్ ఎవరు? ఉగ్రవాదిగా ఎలా మారాడు?
పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు మసూద్ అజహర్. కశ్మీర్ స్వేచ్ఛ అంటూ ఉగ్రవాదిగా మారాడు. 1994లో ఫేక్ ఐడీపై శ్రీనగర్ కు వచ్చాడు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా అతన్ని జైలులో ప్రశ్నించాయి. జైలులో ఉన్న సమయంలో అతన్ని విడిపించుకునేందుకు పాక్ ఉగ్ర సంస్థలు శతవిధాల ప్రయత్నించాయి. అందులో భాగంగానే కాందహార్ హైజాక్ జరిగింది. ఇది భారత్ కు మచ్చగా మిగిలింది.
1999, డిసెంబర్ 24న మసూద్ సానుభూతిపరులు ఇండియన్ ఎయిర్‌లైన్స్-8114ను హైజాక్ చేశారు. అందులో 180 మంది ప్యాసింజర్లు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఫ్లయిట్ ను కాందహార్ కు తరలించారు. ఆ సమయంలో కాందహార్ పాక్ ఐఎస్ఐ మద్దతుతో తాలిబన్ల ఆధీనంలో ఉండేది. ఉగ్రవాదులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కోట్ భల్వాల్ జైలులో ఉన్న మసూద్ అజహర్ ను 1999, డిసెంబర్ 31వ తేదీ అప్పగించారు. ఆ తర్వాత పాక్ ఐఎస్ఐ సంరక్షణలో అజహర్ పాక్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ర్యాలీలు, నిరసనల్లో ఆయన కనిపిస్తున్నా.. పాక్ మాత్రం తమ వద్ద లేడని బుకాయిస్తూనే ఉంది. 2001లో పార్లమెంట్ పై దాడి, 2008 ముంబై పేలుళ్లు, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడులను చేసింది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థనే. ఆ సంస్థను స్థాపించింది మసూద్ అజహరే. 2019, మే 1వ తేదీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు మసూద్ కారుపై బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన మరణించాడని అంతర్జాతీయ మీడియా మొత్తుకుంటున్నా.. పాక్ మాత్రం ఒప్పుకోవడం లేదు. పాక్ కు ఇది అలవాటే.. అజహర్ ను అప్పగించాలంటే మా వద్ద లేడన్న పాక్ చనిపోయింది అజహర్ అని ఎలా ఒప్పుకుంటుంది. ఒత్తుకొని చావాల్సిందే. మసూద్ అజహర్ చావు వెనుక ఎవరున్నారన్నది ఓపెన్ సీక్రెట్ దీన్ని కాస్త పక్కన పెడితే భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తే ఏ దేశంలో తల దాచుకున్నా.. ఊరుకునేది లేదని భారత్ చెప్పకనే చెప్పిందని అర్థం అవుతుంది. మసూద్ అజహర్ చనిపోలేదన్న వార్తలను ప్రస్తుతం పాక్ అంతర్జాతీయ సమాజంలోకి పంపిస్తున్నా గతంలో లాడెన్ కథనే రిపీట్ అవుతుందని అనుకుంటుంది.