CM Jagan : జగన్ కు మిగిలింది ఎవరు? రెండు నెలల్లో తెలుస్తుంది పక్కా!
CM Jagan : వైఎస్ కుటుంబం చాలా పెద్దది. అందులో వైఎస్ తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం సైతం కైవసం చేసుకున్నారు. ఆయన సీఎం కావడానికి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు సైతం షర్మిల, విజయమ్మలే పార్టీని నడిపించారు. ఆతర్వాత ఏం జరిగిందో కానీ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలు చెల్లి షర్మిల కొడుకు పెళ్లికి సైతం వెళ్లలేని విధంగా పెరిగిపోయాయి.
షర్మిల కుమారుడి వివాహానికి జగన్ రెడ్డి ఆయన భార్య వెళ్లలేదు. షర్మిల మీడియా టీమ్ రిలీజ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వైఎస్ బొమ్మను ముందు పెట్టుకుని ఆనందోత్సాహాలతో ఆయన మనవడి వివాహ వేడుకను నిర్వహించుకున్నారు. వైఎస్ విజయమ్మ కూడా సంతోషంగా ఆ వేడుకలో పాల్గొన్నారు. కానీ అక్కడ మిస్ అయ్యింది ఓన్లీ జగన్ ఫ్యామిలీ మాత్రమే.
అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఏం జరిగినా ఇంట్లో పెళ్లిళ్లకూ వెళ్లకూడనంత శత్రుత్వం అయితే పెంచకోకూడదు. ముఖ్యంగా రక్తం పంచుకుపుట్టిన వారితో అసలు పెంచుకోకూడదు. ప్రజాజీవితంలో ఉన్న వారి మైండ్ సెట్ అలాగే ఉండాలి. సొంత వాళ్లనే వ్యక్తిగత స్వార్థాల కోసం దూరం చేసుకుంటే.. ఇక ప్రజలను.. పార్టీ నేతలను..ఎలా దగ్గర చేసుకోగలరు? కాస్త లోతుగా ఆలోచిస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అందరినీ కోల్పోయారు. తల్లి, చెల్లినే కాదు.. ఆయన సొంత పార్టీ నేతలను, ప్రజలను కూడా దూరం చేసుకున్నారు.
గత ఎన్నికల్లో జగన్ రెడ్డి కోసం ప్రాణం పెట్టే పనిచేసిన వారిలో సగం మంది ఇప్పుడు ఆయన తీరుపై అసంతృప్తితో దూరమయ్యారు. వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మిగిలిన వారిలో అత్యధికంగా సైలెంట్ అయ్యారు. ఓ పది శాతం మంది మాత్రం.. ఏదో ప్రయోజనం వస్తుంది కదా అన్న ఆశతో ఇంకా పని చేస్తున్నారు. సొంత పార్టీ క్యాడర్ ఆయన్ను నమ్మడం లేదు. జగన్ రెడ్డికి ఇప్పుడు మిగిలింది సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో మాత్రమే. వారికి రాజకీయపరంగా వచ్చే ఆదాయం ఉన్నంత కాలం ఉంటారు. తర్వాత వారిలో ఒక్కరూ కనిపించారు.
జగన్ రెడ్డి కాస్త వెనక్కి చూసుకుంటే.. తాను సర్వం కోల్పోయానని అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన అధికార మత్తులో ఉన్నారు. అది పోతే కానీ దిగరు. మరో రెండు నెలల్లో జగన్ రెడ్డికి తానేం కోల్పోయారో తెలుసుకునే సమయం వస్తుంది.