Kalki : ‘కల్కి’ ఎవరు ? అవతారం గురించి నిజాలు..

Kalki

Kalki

Kalki :   ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ఈ రోజు (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్‌ సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దీన్ని తెరకెక్కించారు. రెండు ట్రైలర్లతో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇందులో ప్రభాస్ భైరవ పాత్ర పోషించాడు. ట్రైలర్, టీజర్‌ చూస్తే ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌ను కల్కిగా చూపించారు. ఇంతకీ ‘కల్కి’ ఎవరు..? ఎప్పుడు వస్తాడు..? శ్రీమద్భాగవతం ప్రకారం.. విష్ణుమూర్తి పదో అవతారమే కల్కి. కలియుగాంతంలో విష్ణువు కల్కి అవతారమెత్తి లోకాన్ని పరిరక్షిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి గురించి ఏడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం.

కల్కి జన్మస్థలం..
కల్కి సినిమాలో కథ అంతా ‘కాశి’ పట్టణం కేంద్రంగా జరుగుతుంది. భూమిపై మొదటి, చివరి నగరంగా దీన్ని అభివర్ణించారు. కాశి (వారణాసి) ఉత్తరప్రదేశ్‌లో ఉంది. శ్రీమద్భాగవతంలోనూ ఉత్తరప్రదేశ్ ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది. మొరాదాబాద్ పరిధిలోని సంభాల్ గ్రామంలోని విష్ణుయష అనే బ్రాహ్మణుడికి కల్కి జన్మిస్తాడు.

ఆ రోజున భూమిపైకి..!
కల్కి అవతారంపై కొన్ని వాదనలు ఉన్నాయి. శ్రావణ మాసం, శుక్లపక్ష షష్ఠి నాడు కల్కి భూమిపైకి వస్తారు. ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం జులై, ఆగస్ట్ మధ్య జన్మిస్తాడు. శ్రీకృష్ణుడు జన్మించిన 21 పక్షాలకు కల్కి భూమిపైకి వస్తాడని కొన్ని హిందూ శాస్త్రాలు చెప్తుంటాయి. మరికొన్ని శాస్త్రాల ప్రకారం మార్గశిర మాసం కృష్ణాష్టమి రోజున కల్కి జన్మిస్తాడు.

కల్కి కర్తవ్యం..
భూమిపై ప్రజలను పట్టి పీడిస్తున్న శత్రువులను కల్కి సంహరిస్తాడు. సృష్టి రక్షణ కోసం రాక్షసులైన కోక, వికోకలను అంతమొందిస్తాడు. కలియుగ ప్రజలకు వీరి నుంచి విముక్తి కల్పిస్తాడు. మూవీలోనూ నాగ్ అశ్విన్ ఈ హింట్ ఇచ్చాడు.

కలియుగానికి ముగింపు..
పురాణ గ్రంథాల ప్రకారం.. కలియుగ రాక్షసుడైన ‘కల్కి’ ఎన్నో చిత్రహింసలు పెడతాడు. వీటిని తట్టుకోలేక ప్రజలు దేవుడిని శరణు కోరితే ఆ దుష్ట కలిని సంహరించేందుకు విష్ణు మూర్తి ‘కల్కి’ అవతారంతో భూమిపైకి వస్తాడు. కలిని అంతం చేసి కలియుగంకు ముగింపు పలుకుతాడు. కలియుగం ముగిసి సత్య యుగం ప్రారంభం అవుతుంది.

ఖడ్గం, అశ్వం..
కల్కి 64 కళల్లో ఆరితేరిన వీరుడు. దేనినైనా సమర్థంగా ఎదుర్కోగల ధీరుడు. అందుకు తగ్గట్టుగా కల్కి వేషధారణ ఉంటుంది. కల్కి పదునైన ఖడ్గాన్ని వాడుతాడు. దేవదత్త అనే అశ్వంపై స్వారీ చేస్తాడు. వీటి సాయంతో దుష్ఠ శక్తులను అంతమొందిస్తాడు. సత్య యుగానికి స్వాగతం పలుకుతాడు. కల్కి పోరాటంలో పరమ శివుడు కూడా సాయం చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి.

కల్కి కుటుంబం..
కల్కి భగవానుడికి ముగ్గురు సోదరులు కవి, ప్రజ్ఞ, సుమంత్ర. పురాణాల ప్రకారం కల్కి పద్మావతి, రమా అనే ఇద్దరిని వివాహం చేసుకుంటాడు. వీరికి జయ, విజయ, మేఘమాల, బలాహక సంతానంగా జన్మిస్తారు.

రాజ్యపాలన..
కలి రాక్షసుడిని అంతం చేసిన తర్వాత కల్కి ఓ 20 ఏళ్ల పాటు భూమి మీదే ఉంటాడు. శంభాలా రాజ్యాన్ని ఏటుతాడు. తన కర్తవ్యం పూర్తవగానే పద్మావతి, రమను వెంటబెట్టుకొని వైకుంఠానికి వెళతాడు.

TAGS