Janhvi kapoor:జాన్వీ క‌పూర్ ప్రియుడు ఎవ‌రో తెలుసా?

Janhvi kapoor:అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీక‌పూర్ బాలీవుడ్‌లో బిజీ నాయిక‌. దేవర చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఇప్ప‌టికే న‌టిగా ప్రూవ్ చేసుకున్న జాన్వీ, త‌దుప‌రి తార‌క్ స‌ర‌స‌న‌ పాన్ ఇండియా రేస్‌లోకి ప్ర‌వేశిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ స్టార్ స‌ర‌స‌న జాన్వీకి అరుదైన అవ‌కాశ‌మిది. మ‌రోవైపు బాలీవుడ్‌లో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నా.. టాలీవుడ్ డెబ్యూ కోసం కొన్నిటిని హోల్డ్ లో ఉంచింద‌ని తెలిసింది.

ఇక జాన్వీక‌పూర్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్న వేళ త‌న వ్య‌క్తిగ‌త జీవితం, ల‌వ్ లైఫ్ గురించి తెలుసుకోవాల‌నే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. జాన్వీ చాలా కాలంగా ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడి వార‌సుడు శిఖర్ ప‌హారియాతో సంబంధంలో ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ జోడీ అధికారికంగా వారి డేటింగ్ గురించి ఎప్పుడూ ధృవీకరించలేదు.. అలాగ‌ని ఖండించ‌నూ లేదు. ఆ ఇద్ద‌రూ రెగ్యుల‌ర్‌గా బహిరంగంగా కనిపించడం డేటింగ్ ఊహాగానాలకు ఆజ్యం పోస్తుంది. కలిసి ఆలయ సందర్శనలకు వెళ్ల‌డం ఔటింగుల‌కు వెళుతూ దిగిన ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండ‌డంతో డేటింగ్ పుకార్లు మొద‌ల‌య్యాయి.

ఆ ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఎంతో స‌న్నిహితంగా ప్రేమ‌గా ఉంటారు. ఇటీవల జాన్వి అద్భుతమైన చీరలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసింది. ఈ రూపానికి ప‌ర‌వ‌శుడైన‌ శిఖర్ ఒక స్వీట్ కామెంట్ చేసాడు.హాయ్ మై లడూ అని గుండె-ఐ ఎమోజీల‌ను షేర్ చేసాడు. దీంతో మరోసారి ఈ జంట సాన్నిహిత్యంపై ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. శిఖ‌ర్ తో జాన్వీక‌పూర్ స్నేహ‌మా? ప్రేమా? అన్న‌దానిపై ఇంకా పూర్తి స్ప‌ష్ఠ‌త లేదు.

TAGS