JAISW News Telugu

TDP-Janasena-BJP Alliance : ‘కూటమి’ పొత్తులో ఏ స్థానంలో ఎవరు? ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం..

TDP-Janasena-BJP Alliance

TDP-Janasena-BJP Alliance

TDP-Janasena-BJP Alliance : ఏపీలో జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన విషయం తెలిసిందే. మూడు పార్టీల సీట్లపై ఢిల్లీ వేదికగా ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీ-జనసేనకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయించింది. దీనికి మిగతా రెండు పార్టీలు కూడా ఒప్పుకున్నాయి.  ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు? ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బీజేపీ-జనసేన సీట్లలో జనసేనకు 3 ఎంపీ, 24 అసెంబ్లీ సీట్లు, బీజేపీకి 6 ఎంపీ, 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. బీజేపీకి కేటాయించే స్థానాలపైన టీడీపీ ఇప్పటికే ప్రతిపాదనలు ఇవ్వగా.. ఏ స్థానం ఫైనల్ చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా బీజేపీ నాయకులు విజయవాడకు చేరుకున్నారు. పురందేశ్వరి, పవన్ తో బీజేపీ కేంద్ర బృందం భేటీ అయ్యింది. గజేంద్రసింగ్ షెఖావత్, జయంత్ పాండా, శివప్రకాశ్ చర్చలు జరిపారు. అయితే నేడు మూడు పార్టీల మీటింగ్ లో చంద్రబాబు పాల్గొననుండడంతో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ సీట్లలో అనకాపల్లి నుంచి ఆ పార్టీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి స్థానం బీజేపీకి కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

బీజేపీ తమకు అనకాపల్లి స్థానంలో విశాఖ ఇవ్వాలని కోరుతోంది. అందుకు చంద్రబాబు అంగీకరించడం లేదు. దీంతో అనకాపల్లి నుంచే బీజేపీ పోటీ చేసే చాన్స్ కనిపిస్తోంది. దీంతో జనసేన కాకినాడ, మచిలీపట్నం స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇక ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన తమకు కేటాయించిన 24లో ఇప్పటి వరకు 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాలపైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి ఇచ్చే ఆరు స్థానాలపై ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. కానీ బీజేపీ నుంచి మరో నాలుగు అసెంబ్లీ స్థానాలపైన ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. అయితే బీజేపీకి అసెంబ్లీ స్థానాలు పెంచే అంశంపై అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది. బీజేపీ విశాఖతో పాటు విజయవాడ స్థానం ఆశిస్తోంది. కానీ టీడీపీ విజయవాడ స్థానం వదులుకోవడానికి సిద్ధంగా లేదు.

ఇవాళ విజయవాడలో బీజేపీ కేంద్ర నాయకత్వంతో చంద్రబాబు, పవన్, పురందేశ్వరితో సమావేశం కానుంది. బీజేపీకి కేటాయించిన ఎంపీ స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. రాజంపేట నుంచి మాజీ సీెం కిరణ్ కుమార్ రెడ్డి పేరు రేసులో ఉన్నా.. అక్కడ సీఎం రమేశ్ పోటీకి దిగే చాన్స్ ఉంది. నర్సాపురంలో అభ్యర్థి ఎవరనేది  తేలాల్సి ఉంది. అసెంబ్లీ అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ సీట్ల విషయంలో కొన్ని మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. దాదాపుగా ఈ రోజు జరిగే సమావేశంలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపో, మాపో తుది జాబితా ప్రకటించే చాన్స్ ఉంది.

Exit mobile version