AP Elections : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనం ఎప్పుడో నిర్ణయించుకున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎవరు మంచి పాలన అందిస్తారో వారినే ఎన్నుకోవాలని భావిస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా టెన్షన్ మొదలైంది. ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తే ఎలా ఉంటుందనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు ఒకే కూటమిగా ఏర్పడడంతో జనం ఎవరికీ జేజేలు కొడతారనే సందిగ్ధం ఏర్పడింది.
సమాజంలో పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలుంటాయి. వారి మనోభీష్టం వేరుగా ఉంటుంది. సంక్షేమ పథకాల అమలు చేసే వారికే ఓట్లు వేస్తామనే వారుంటారు. డెవలప్ మెంట్ చేసే వారికే తమ మద్దతు ఉంటుందని భావించేవారున్నారు. పని చేసే వారికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇందులో ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అంచనా వేయడం కష్టమే.
ఎవరికైతే ఓటు వేయాలని అనుకున్నారో కచ్చితంగా వారికే వేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కూటమి బలంగా ఉంది. వారికే చాలా మంది మొగ్గు చూపుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించడం తథ్యమనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో వైసీపీకి ఓటమి తప్పదని అంటున్నారు.
ఈనేపథ్యంలో టీడీపీ కూటమి అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని చెబుతున్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు భయపడుతున్నారు. వైసీపీ నేతల ఆగడాలు దగ్గరుండి పరిశీలించిన వారు ఇక ఆ పార్టీకి అధికారం ఇవ్వడం కలే అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయం సాధించి మంచి పాలన అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. అయితే వీరు విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి కచ్చితంగా వైసీపీకే ప్లస్ అయ్యేది. 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యేవి. ఈ విషయం తెలిసే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుకు భేషరతుగా ఒప్పుకున్నారు. సీట్ల విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా పొత్తులోకి తీసుకురావడం ద్వారా జగన్ అధికార ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చని భావించారు. అందుకే టీడీపీకి కొన్ని సీట్లు తక్కువైనప్పటికీ మరి ఆ పార్టీని కూడా పొత్తులోకి తీసుకొచ్చారు. దీంతో గెలపు అవకాశాలు కూటమికే స్పష్టంగా కనపడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనాలు కూడా గెలిచే పార్టీకే ఓట్లు వేసే ఆలోచన చేస్తారు. దీన్ని బట్టి వారు ఎప్పుడో అధికార పార్టీని మార్చే పనిలో ఉన్నట్లు అర్థమవుతోంది.