KTR : ఏపీలో ఎవరు గెలవబోతున్నారు..కేటీఆర్ ఏం చెప్పారంటే..

KTR

KTR

KTR : ఏపీ ఎన్నికల ఫలితంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఇంకా ఫలితాలు రాకపోయినా తాజా అంచనాల ప్రకారం..ఏపీలో ఏం జరుగుతుంది? ఎవరు అధికారంలోకి రానున్నారు? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఢిల్లీలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ ను తెలంగాణ మీడియా ఇదే అంశంపై ప్రశ్నించింది. ఏపీలో జగనే మరోసారి అధికారం దక్కించుకుంటారని తమకు సమాచారం ఉందన్నారు.

ఇదే టైంలో ఏపీలో పోలింగ్ శాతం అత్యధికంగా నమోదైందని..ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం కాదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. పోలింగ్ శాతం పెరిగినంత మాత్రాన వ్యతిరేకతే అని ఎందుకు అనుకోవాలి. పాజిటివ్ ఓటు కూడా కావొచ్చు కదా అని కేటీఆర్ చెప్పారు. గతంలో కేసీఆర్ కూడా ఎన్నికలకు ముందు ఇలాగే స్పందించారు. ఇప్పుడు కేటీఆర్ సైతం ఇదే వ్యాఖ్య చేయడం..పోలింగ్ పర్సంటేజీ కూడా వైసీపీ అనుకూలంగా చెప్పడం గమనార్హం.

ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం ఏపీ ఫలితాలపై నో కామెంట్ అంటున్నారు. అయితే కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని జానా రెడ్డి చెప్పారు. ఇక ఇతర పార్టీల నాయకులు కూడా ఏపీ ఫలితంపై మౌనంగానే ఉన్నారు. మరికొందరు ఏమైనా జరగవచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ముందు మీడియాతో పలుసార్లు మాట్లాడిన జయప్రకాశ్ నారాయణ వంటి మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా మౌనంగా ఉండడంతో ఏపీ ఫలితాలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

TAGS