JAISW News Telugu

Big Boss Season-8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరెవరు ఉండబోతున్నారంటే.. మాజీ కంటెస్టెంట్ చెప్పిన లిస్ట్ ఇదే..

Big Boss Season-8

Big Boss Season-8

Big Boss Season-8 : బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో అలరించిన విషయం తెలిసిందే. మొన్ననే అయిపోయినట్టుగా అనిపిస్తుంది కూడా. ఆ సీజన్ ను మరిచిపోకముందే 8వ సీజన్ కు రెడీ అవుతున్నారు నిర్వాహకులు. రాబోయే సీజన్ కు ఇప్పటి నుంచే హైప్ తెచ్చే పనిలో పడ్డారు. బిగ్ బాస్ సీజన్ 1కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. సీజన్ 2కు నాని..సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ అంటే నాగ్..నాగ్ అంటే బిగ్ బాస్ అన్నట్టుగా మారిపోయింది. ఇక బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అన్ని సీజన్ లలో కెల్లా సీజన్ 7 అత్యధిక రికార్డులను క్రియేట్ చేసింది.  రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ 7కు మించి రాబోయే సీజన్ ను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారా? అని ఆడియన్స్ ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా యూట్యూబర్ ఆదిరెడ్డి.. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనే 18 మంది కంటెస్టెంట్స్ వీరే అని ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇలా బిగ్ బాస్ గురించి యూట్యూబ్ లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యి ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇతర కంటెస్టెంట్స్ బలాలు, బలహీనతలను చెప్పుతూ వీడియోలు చేసి మరింత ఫేమస్ అయ్యాడు. సీజన్ 8 మొదలు కానుంది అని తెలియడంతోనే కంటెస్టెంట్స్ వీరే అని తన ప్రాబబుల్స్ చెప్పాడు.

ఆదిరెడ్డి చెప్పిన వారిలో ఎవరెవరు ఉన్నారంటే..యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, నటి హేమ, ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ, రీతూ చౌదరి, సురేఖా వాణి లేదా ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉందట. అలాగే నీతోనే డాన్స్ 2.0లో పాల్గొన్న ఒక జంట, లేదా జంటలో ఒకరు కావొచ్చట. అంజలి పావని, యాంకర్ శివ, నయని పావని, యాంకర్ స్రవంతి చొక్కారపు, మాస్టర్ చెఫ్ సంజయ్, రైతుబడి రాజేంద్రరెడ్డి, ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబర్, ఫారిన్ లో సెటిలైన వ్లాగర్స్ లో ఒకరు ఉండనున్నారు. మరి నిర్వాహకులు వీరిలో ఎవరికీ చాన్స్ ఇస్తారో తెలియాలంటే మరికొంత కాలం దాక ఆగాల్సిందే.

Exit mobile version