AP Congress : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇన్నాళ్లు ఎన్డీయే కూటమి, వైసీపీకి మధ్యే పోటీ అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వామపక్షాలతో జత కట్టడంతో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉందంటున్నారు. ఈనేపథ్యంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద స్పష్టమైన లెక్కలు రావడం లేదు. దీంతో ఏం జరుగుతుందోననే బెంగ అందరిలో పట్టుకుంది.
కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వారి జాబితా విడుదల చేశారు. ఇందులో సీనియర్లు ఉండడంతో విజయావకాశాలను ప్రభావితం చేస్తారని అంటున్నారు. ఎన్డీయే, వైసీపీ కూటమి ఓట్లలో చీలిక రావచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితాలు తారుమారవుతాయని చర్చలు వస్తున్నాయి. లోక్ సభకు 6, అసెంబ్లీకి 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఎన్డీయే, వైసీపీ మధ్య హోరాహోరా పోరు ఉంటుందని భావించినా కాంగ్రెస్ సీనియర్ల మోహరింపుతో లెక్కలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఏలూరు నుంచి కావూరి లావణ్య, నెల్లూరు నుంచి కొప్పుల రాజు, తిరుపతి నుంచి చింతా మోహన్, టెక్కలి అసెంబ్లీకి వైసీపీ నుంచి వచ్చిన కిల్లి కృపారాణికి బెర్త్ ఖాయమైంది. పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబుకు అవకాశం దక్కింది.
షర్మిల పీసీసీ పగ్గాలు తీసుకున్న తరువాత పార్టీలో మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అంచనా వేసినా ఆ సెగ ఎన్డీయే కూటమికి కూడా తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా రాజకీయం చేస్తామని అనుకున్నా కుదరడం లేదని చెబుతున్నారు.
కాంగ్రెస్ వామపక్షాల కూటమితో అందరికీ భయం పట్టుకుంది. ఎక్కడ తమ ఓట్లు చీలతాయోననే బెంగ అందరిలో ఎక్కువైంది. ఎక్కడ ఏ మేర ఓట్లు చీలతాయోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల గెలుపోటములపై అప్పుడే ఓ అంచనాకు రాలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మరో పోటీదారుగా మారడంతో ఆందోళన నెలకొంది.