CSK Vs GT : చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య శుక్రవారం సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ లో కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో గనక గుజరాత్ ఓడిపోతే ఇంటి బాట పట్టాల్సిందే. చెన్నై 12 పాయింట్లతో టాప్ ఫోర్ ప్లేస్ లో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిచి మూడో స్థానానికి ఎగబాకాలని ప్రయత్నిస్తోంది. చెన్నై, గుజరాత్ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది.
చెన్నై, గుజరాత్ ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడాయి. గుజరాత్ నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లలో ఉంది. చెన్నై ఆరు మ్యాచులు గెలిచి 12 పాయింట్లతో ఉంది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. శివమ్ దూబె, దోని కూడా చివర్లో దంచి కొడుతున్నారు. అజింక్య రహనే మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అజింక్య రహనే ఫామ్ లోకి రావాలని టీం కోరుకుంటోంది. రచిన్ రవీంద్రను ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గుజరాత్ టీం మాత్రం ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. గుజరాత్ టీం ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన రెండు సంవత్సరాలు అదరగొట్టింది. కానీ మూడో సీజన్ లో మాత్రం శుభమన్ గిల్ కెప్టెన్సీలో సరిగా ఆడలేకపోతుంది. గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హర్దిక్ పాండ్యా టీంను విడిచి వెళ్లిపోవడం కూడా ప్రతికూలంగా పని చేసింది.
రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఫామ్ కోల్పోయాడు. మోహిత్ శర్మ కూడా దారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. సాహా బ్యాటింగ్ లో రాణించడం లేదు. సాయి సుదర్శన్ కూడా ఆశించిన స్థాయిలో పరుగులు చేయడం లేదు. విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా పూర్ బ్యాటింగ్ పర్ఫామెన్స్ చేస్తున్నారు. దీంతో గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలవడం కష్టమే అనే భావనలోకి ఫ్యాన్స్ వచ్చేశారు. మరి శుభమన్ గిల్ ఏదైనా మాయ చేసి గెలిస్తేనే టీం ప్లే ఆప్ రేసులో ఉంటుంది. లేకపోతే రేపటితో ఇంటి బాట పడుతుంది.