JAISW News Telugu

AP Employees : ఉద్యోగులకు నష్టం చేసిందెవరు? ఇప్పుడా నిద్రలేచేది?

AP Employees

AP Employees

AP Employees : ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులే కాదు ఉద్యోగులు ఉంటారు. వాస్తవానికి ప్రజాప్రతినిధులు చట్టాలు మాత్రమే చేయగలరు..కానీ వాటిని అమలు చేసేది మాత్రం అధికారులే. ఇక ఏ కొత్త పథకం తీసుకురావాలన్నా, ఆ పథకాలు విజయవంతం కావాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుంది.

అలాంటి ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఏకంగా 21వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. వారి జీతం నుంచి రకరకాల కటింగ్ ల పేరుతో వచ్చిన డబ్బులను ప్రభుత్వం వాడేసుకుంది. వారికి కల్పించాల్సిన ప్రయోజనాలను తొక్కి పెట్టేసింది. చివరికి పిల్లల పెళ్లిళ్లకూ డబ్బులు ఇవ్వకుండా బయట అప్పులు చేసేలా ప్రోత్సహించింది. గత ఐదేండ్లుగా జగన్ రెడ్డి ఉద్యోగులకు ఎలాంటి ట్రీట్ మెంట్లు ఇచ్చాడో లెక్కేలేదు.

పోరాడితే కేసులు పెడతారన్న భయంతో.. వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించుకునే లక్ష్యంతోనే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం మోకారిల్లారు. ఎలాంటి డిమాండ్లు చేయలేదు. టీచర్లు ఓసారి రోడ్డెక్కి ప్రభుత్వానికి వణుకుపుట్టిస్తూ.. ప్రభుత్వానికి అమ్ముడుపోయి.. వారిని మోసం చేశారు. 21 వేల కోట్ల బకాయిలు ఉన్నా.. బండి శ్రీనివాసరావు, బొప్ప రాజు వంటి వాళ్లు ప్రభుత్వాన్ని పొగుడుతూ.. తమ పబ్బం కానిచ్చుకున్నారు. చివరకు వైసీపీ రాజకీయ వ్యూహాల్లో భాగమని.. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎస్ఈసీ పైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు.

ఇప్పుడు ఎన్నికలకు ముందు తమకు 21 వేల కోట్లు రావాలంటూ.. చర్చలు ప్రారంభించారు. జగన్ రెడ్డి ఇప్పటికే ఆస్తుల్ని.. ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి దివాళా అంచుకు రాష్ట్రాన్ని చేర్చారు. ఉద్యోగులు రిటైర్ మెంట్ డబ్బులివ్వలేక.. రెండేళ్లు వయసు పెంచారు. ఇప్పుడు రిటైర్ మెంట్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఇదంతా ఎదురుగా కనిపించే నిజం. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు వారి డబ్బులు కూడా వారికి ఇవ్వదు. ఐదేళ్లు అడగకపోవడం వల్ల మారే ప్రభుత్వంలోనూ గట్టిగా అడగలేని దౌర్భాగ్య పరిస్థితిని ఉద్యోగులకు ఉద్యోగ సంఘ నేతలు తెచ్చారు. ఉద్యోగులకు ఉద్యోగ సంఘ నేతలు చేసినంత నష్టం ప్రభుత్వం కూడా చేయలేదనే చెప్పాలి. పోరాడే ఓ గొప్ప లక్షణాన్ని జగన్ రెడ్డికి తాకట్టు పెట్టేశారు. ఇక ఎప్పటికీ ఉద్యోగ సంఘాలు పోరాడలేని పరిస్థితికి తెచ్చారు.

Exit mobile version