Middle Class Voters : ఏపీ లో మధ్యతరగతి ఓటర్ల మద్దతు ఎవరికి దక్కింది.
Middle Class Voters : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. కానీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు. అధికారం ఎవరికి దక్కుతుంది.మెజార్టీ స్థానాలు ఏ పార్టీకి రాబోతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు విజయం సాధిస్తున్నారు. ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది. ఈ ఎన్నికల్లో కాపు కులస్తుల ఓట్లు ఎవరికి పడ్డాయి. మధ్య తరగతి ఓటర్లు ఎవరికి అండగా నిలిచారు. అనే అంశాలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటికీ చర్చ ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. పోలింగ్ శాతం గతంలో కంటే రెండు శాతం అధికంగా నమోదు అయ్యింది. దీనితో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అధికారం చేపడుతుందనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు వైసీపీ కే అధికారం దక్కుతున్నదని చెప్పుకుంటున్నారు.
గత ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. కానీ గడిచిన ఐదేళ్ల కాలంలో మధ్యతరగతి కుటుంబాలపై పలు నియోజకవర్గాల్లో దాడులు జరిగాయి. వారి ఆస్తులను ధ్వంసం చేసిన సందర్బాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు వారంతా కూడా వైసీపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఓటు వేశారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ పై కోపంతోనే మధ్యతరగతి ఓటర్లు కూటమికి ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా ఓటింగ్ శాతం పెరిగిందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
ఎన్నికల్లో కమ్మ, కాపు వర్గాలు రాజకీయ పార్టీలపై ప్రభావం చూపుతాయి. ఆ రెండు వర్గాలపై కూడా వైసీపీ నాయకులు దాడులు చేయడం తప్పలేదు. వారి ఆస్తులను ధ్వంసం చేయడం వైసీపీ నాయకులకు మామూలైనది. వ్యక్తిగతంగా దూషించడంతో పార్టీపై వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు ఆ రెండు వర్గాలు కూడా వ్యతిరేకంగా ప్రచారం చేసి, కూటమికే ఓటు వేశారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
సంక్షేమ పథకాలు కూడా అధికంగా వైసీపీ నేతలకే దక్కినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన ప్రజలకు పథకాలు అందలేదని ఆరోపణలు సైతం ఉన్నాయి. ఒకవేళ అర్హులకు దక్కాలంటే ఎంతో కొంత ముట్టచెబితేనే పని అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ముట్టచెప్పే పద్దతి కూడా వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చి పెట్టిందనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న కాపు, కమ్మ, మధ్యతరగతి కుటుంబాలతో పటు సంక్షేమ పథకాలతో నష్టపోయిన వారంతా కూడా కూటమి కి ఓటువేసినట్టుగా ప్రచారం ఏపీ లో సాగుతోంది.