Assembly Speaker : నీటి పారుదల శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల.. నన్నెవరూ ప్రశ్నించొద్దన్న స్పీకర్
Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమ య్యాయి. సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79 లక్షల ఎకరాలు ఉంటే.. మొత్తం ఖర్చు 54,234 కోట్లు అని అన్నారు. 2014 వరకు ఒక్కో ఎకరానికి 93వేల కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు పదేళ్లలో ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు. బీఆర్ఎస్ హయాంలో కొత్త ఆయకట్టు 15.81 లక్షల ఎకరాలు.. బీఆర్ఎస్ హయాంలో ఒక్కో ఎకరం ఖర్చు 14.45 లక్షలు అని ఉత్తమ్ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే అధికార, విపక్ష నేతల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే, హరీశ్ రావు మాట్లాడుతూ.. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావొద్దని, టెక్నీషియన్ ను సభలోకి అనుమతించ వద్దని హరీశ్ రావు అన్నారు.
మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలిఅంటే టెక్నీషియన్ ను బయటకు పంపాలని హరీశ్ రావు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకొని.. గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, టెక్నీషి యన్ ద్వారా నే ఇచ్చారని గుర్తుచేశారు. స్పీకర్ అనుమతితోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చా రని శ్రీధర్ బాబు తెలిపారు. స్పీకర్ మాట్లాడుతూ.. అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించామని సభ్యులకు క్లారిటీ ఇచ్చారు. గతంలో సీఎంగా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్ ఉన్నాడు. నేను టెక్నీషియన్ కు అనుమతి ఇస్తున్నా.. నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు అంటూ సభ్యులకు స్పీకర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.