KTR : తెలబంగారం తెల్లబోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల తీరుపై ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కలేదని ఎద్దేవా చేశారు. దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నాని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు. రైతు డిక్లరేషన్ బోగస్.. కర్షక ద్రోహి కాంగ్రెస్ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.