JAISW News Telugu

American Election : అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మూడ్ ఎటువైపు.. బైడెనా..? ట్రంపా..?

American Election

American Election

American election : అమెరికాలో ఎన్నికలు సమరం మొదలైంది. బైడెన్, ట్రంప్ హోరా హోరీ పోటీ పడుతున్నారు. ఇటీవల ట్రంప్ పై జరిగిన హత్యాయత్నంతో ఆయన గెలుపు శాతం పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవాసులతో పాటు ఇతర దేశస్తుల మూడ్ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.

2020 నుంచి 2024 వరకు ప్రవాస భారతీయుల్లో అధ్యక్షుడు జో బైడెన్ కు మద్దతు గణనీయంగా తగ్గింది. 2020 సమయంలో ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక వైఖరి, జాత్యహంకార ధోరణి కారణంగా ట్రంప్ పై ప్రవాసుల్లో వ్యతిరేకత మొదలైంది. అయితే, ఈసారి ఆయన భారతీయ అమెరికన్లలో గణనీయమైన అభిమానాన్ని చూరగొనడంతో మారాయి.

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల డిబేట్ తర్వాత ట్రంప్‌నకు ఆధిక్యం లభించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు ఓపెన్ ఎయిర్ మీటింగ్ లో ట్రంప్ పై జరిగిన దాడితో ఆయనపై భారీగా సానుభూమి పెరిగి గెలుపును మరింత చేరువ చేస్తుంది. అధ్యక్ష పదవికి ఆయన మార్గం అనివార్యంగా కనిపిస్తోంది. ఫలితాలు, సర్వేలు పూర్తిగా ట్రంప్ నకు అనుకూలంగా మారాయి.

ఆసియా నుంచి వలస వెళ్లిన వారు వేగంగా పెరగి వారు అర్హులైన ఓటర్ల సమూహంగా మారారు.. నాలుగేళ్లలో 15 శాతానికి పైగా పెరిగారు. ఓటుపై వారికి ఉన్న బాధ్యతతో ఇటీవలి ఎన్నికల్లో రికార్డు పోలింగ్ ను చూపించారు. 2020లో బైడెన్ విజయంలో ముఖ్యంగా యుద్ధాలు జరుగుతున్న రాష్ట్రాల్లో వీరి మద్దతు కీలకంగా మారింది.

ఇటీవల అక్కడ నిర్వహించిన సర్వేల్లో కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి. ఆసియా అమెరికన్ ఓటర్లకు ఉద్యోగాలు మరియు ఆర్థిక వ్యవస్థ (86%), ద్రవ్యోల్బణం (85%), ఆరోగ్య సంరక్షణ (85%), నేరం (80%), విద్య (80%), సామాజిక భద్రత మరియు మెడికేర్ (79%), గృహ ఖర్చులు (78%), జాతీయ భద్రత (77%), తుపాకీ నియంత్రణ (73%), మరియు ఇమ్మిగ్రేషన్ (71%) ఉన్నాయి. మూడింట రెండొంతుల మంది విద్వేష నేరాలు, వేధింపులు, వివక్ష గురించి ఆందోళన చెందుతున్నారు.

అబార్షన్, జాత్యహంకారం, తుపాకీ నియంత్రణ వంటి సమస్యలను డెమొక్రటిక్ పార్టీ మెరుగ్గా నిర్వహిస్తుందని ఆసియన్ అమెరికన్ ఓటర్లు నమ్ముతారు, అయితే వారు జాతీయ భద్రత, వలసలు, ద్రవ్యోల్బణం, నేరాలపై రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.

Exit mobile version