JAISW News Telugu

Married : పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం ఏది బెస్ట్..?

Married

Married or not

Married : 80వ దశకం.. కొంచెంలో కొంచెం 90వ దశకంలో వివాహం చేసుకున్న వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు. కానీ 20వ దశకంలో వివాహాలంటే అమ్మాయిలు జంకుతున్నారు.. అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువగా భయపడుతున్నారు. అయితే ఇప్పటి జనరేషన్ పెళ్లిళ్లు చేసుకుంటే ఏం కోల్పోతాం..? ఏం ఒరుగుతుంది..? వంటి వాటిపై పిచ్చ క్లారిటీగా ఉన్నారని తెలుస్తోంది. పెళ్లి చేసుకోకపోవడం నష్టాలను తెచ్చిపెడుతుందా? పెళ్లి చేసుకోవడం లాభాలను తెచ్చిపెడతుుందా? తెలుసుకుందాం.

సాంఘిక ఒత్తిడి.. సమాజంలో వివాహం అనేది ఒక ముఖ్య ఘట్టం. ఒక ఏజ్ కు వచ్చావంటే చాలు ఎక్కడ పడితే అక్కడ అడిగేది ఒకటే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? పెళ్లి చేసుకోకపోతే ప్రతీ కాడ అవమానమే ఎదురవుతుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్ నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.

ఒంటరితనం.. వివాహం చేసుకోకుండా పార్ట్నర్ ఉండదు. కాబట్టి జీవితంలో ఒంటరితనం ఆవహిస్తుంది. ఈ ఒంటరి తనం నుంచి విచారం కలుగుతుంది. ఎప్పటికీ ఒంటరిగా ఉండడంతో డీప్రెషన్ లోకి కూడా వెళ్లవచ్చు.

ఆరోగ్య సమస్యలు.. కొన్ని అధ్యయనాల ప్రకారం.. వివాహం చేసుకున్న వారు ఒంటరిగా ఉండే వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని, మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెప్తున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు.. ఒంటరిగా నివసించడం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుంది. భార్య, పిల్లలు, ఇళ్లు మెయింటెనెన్స్ రోజు రోజుకు పెరుగుతుంది. వయస్సు పెరిగే కొద్దీ సహజంగా పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గుతాయి.

సామాజిక నష్టాలు.. రాను రాను వివాహాలు తగ్గడం వల్ల న్యూ జనరేషన్ ఉండదు. కాబట్టి అంతా ముసలి వారు ఎక్కువవుతారు. వృద్ధుల శాతం పెరిగి దేశంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

కుటుంబ విలువల క్షీణత.. కుటుంబం సమాజం యొక్క ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. ఒంటరి వారిని కుటుంబంగా పరిగణించరు. కాబట్టి, వివాహ రేట్లు తగ్గడం వల్ల కుటుంబ విలువలు బలహీనపడవచ్చు.

సాంస్కృతిక మార్పులు.. వివాహం చాలా సంస్కృతుల్లో ముఖ్యమైన సంస్కృతిక ఘట్టం. వివాహ రేటు తగ్గడం వల్ల సంప్రదాయాలు, విలువల్లో మార్పులు వస్తాయి. ఈ నష్టాలు అన్నింటికీ వర్తించవు. కొంత మంది పెళ్లి చేసుకోకుండా సంతోషంగా, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతుంటారు. పెళ్లి చేసుకోవాలా..? వద్దా..? అనేది వ్యక్తి గత నిర్ణయం. ప్రతి ఒక్కరూ తమకు ఏది సరైనదో నిర్ణయించుకోవాలి.

పెళ్లి చేసుకోకపోవడం వలన కూడా ప్రయోజనాలు కూడా లేకపోలేదు.. ఒంటరి వ్యక్తులు తమ జీవితాన్ని ఎలా గడపాలని కోరుకుంటారో అలానే గడుపుతారు. ఒంటరిగా ఉంటారు కాబట్టి వృత్తిపై ఎక్కువ దృష్టి పెట్టి లక్ష్యాలను సాధిస్తారు. ఒంటరి వ్యక్తులకు తమను తాము తెలుసుకునేందుకు, ఎదిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఒంటరి వ్యక్తులు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో బలమైన బంధాలను ఏర్పరచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది.

Exit mobile version