Sankranti Hero : సంక్రాంతి అనేది చిత్ర పరిశ్రమకు కూడా అతి ముఖ్యమైన పండుగ. ఈ సమయంలో చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ అనే తేడా లేకుండా పోటా పోటీగా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఈ పండుగకు కుటుంబాలు అందరూ కలిసి ఉంటుండడంతో ఈ పండుగ సీజన్ రికార్డు స్థాయి కలెక్షన్లకు పెట్టింది పేరు. అయితే సంక్రాంతి సందర్భంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు పోటీలో నిలపాలని నిర్మాతలు, దర్శకులు భావిస్తుంటారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ కోసం తెలుగు రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా థియేటర్లు, స్పెషల్ బెనిఫిట్ షోలు, ఎర్లీ స్క్రీనింగ్స్ దక్కించుకోవాలని దిల్ రాజు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోయే సినిమా దాదాపు 25 శాతం షూటింగ్ పూర్తయ్యింది. దీనికి భిన్నంగా నాగచైతన్య తాండేల్ వివిధ కారణాల వల్ల 2025 సంక్రాంతి రిలీజ్ మిస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సారి పోటీ గేమ్ ఛేంజర్, #NBK109 మధ్య ఉండేలా కనిపిస్తుంది. కానీ రామ్ చరణ్, బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ పోటీ అంత థ్రిల్లింగ్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే వారి అభిమాన సంఘాలు సాధారణంగా ఒకదానితో ఒకటి పోటీపడవు. ఇది బోరింగ్ బాక్సాఫీస్ కు దారితీస్తుంది.
తండేల్ తప్పుకోవడంతో సందీప్ కిషన్ నటించిన మజాకా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అనుకుంటుంది. త్రినాథరావు దర్శకత్వం వహించిన మజాకా సంక్రాంతి రిలీజ్ డేట్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంది. మాస్ కమర్షియల్ హిట్స్ అందించడంలో దిట్టాగా గుర్తింపు సంపాదించుకున్న త్రినాథరావు డైరెక్షన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.
సంక్రాంతి వంటి ఆనందకరమైన పండుగ జరుపుకోవడానికి మజాకా పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఉత్సాహపడాలంటే పాటలు, ప్రోమోలు, ట్రైలర్ పైనే ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు చక్కబడితే సందీప్ కిషన్ కు లాటరీగా మారే అవకాశం ఉంది.